Share News

Bandi Sanjay: డాక్యుమెంట్లతో రా.. ఆస్తులన్నీ పంచుతా.. గంగులకు బండి ఛాలెంజ్

ABN , First Publish Date - 2023-11-19T14:57:57+05:30 IST

మంత్రి గంగుల కమలాకర్(Gangula Kamalakar)కి బీజేపీ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) ఛాలెంజ్ విసిరారు.

Bandi Sanjay: డాక్యుమెంట్లతో రా.. ఆస్తులన్నీ పంచుతా.. గంగులకు బండి ఛాలెంజ్

కరీంనగర్: మంత్రి గంగుల కమలాకర్(Gangula Kamalakar)కి బీజేపీ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) ఛాలెంజ్ విసిరారు. ఇవాళ కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ.. తన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లతో గంగుల రావాలని.. అలా చేస్తే తనకున్న ఆస్తులన్నీ ప్రజలకు పంచుతానని తెలిపారు. తనలాగే గంగుల ఆస్తుల్ని పంచే ధైర్యం గంగులకు ఉందా అని సవాల్ విసిరారు.

పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండి ఇప్పటివరకు నియోజకవర్గంలో రేషన్ కార్డులు ఇవ్వని వ్యక్తి మళ్లీ గెలిపిస్తే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాను ప్రజల కోసం కొట్లాడానని, తనపై 74 కేసులు ఉన్నట్లు తెలిపారు. కుటుంబానికి దూరమై ప్రజల కోసం కొట్లాడుతున్నట్లు చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గంగులను చిత్తుగా ఓడిస్తానని స్పష్టం చేశారు. గ్రానైట్ యూనియన్ ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

Updated Date - 2023-11-19T14:57:58+05:30 IST