Bandi Sanjay: బీఆర్ఎస్‌ బడ్జెట్ మొత్తం డొల్లానే

ABN , First Publish Date - 2023-02-06T18:39:55+05:30 IST

బీఆర్ఎస్‌ (BRS) బడ్జెట్ మొత్తం డొల్లానేనని బీజేపీ నేత బండి సంజయ్‌ (Bandi Sanjay) ఎద్దేవాచేశారు. కేంద్రాన్ని తిట్టడం, సీఎం కేసీఆర్‌ (CM KCR)ను పొగడటం తప్ప బడ్జెట్‌..

Bandi Sanjay: బీఆర్ఎస్‌ బడ్జెట్ మొత్తం డొల్లానే

హైదరాబాద్: బీఆర్ఎస్‌ (BRS) బడ్జెట్ మొత్తం డొల్లానేనని బీజేపీ నేత బండి సంజయ్‌ (Bandi Sanjay) ఎద్దేవాచేశారు. కేంద్రాన్ని తిట్టడం, సీఎం కేసీఆర్‌ (CM KCR)ను పొగడటం తప్ప బడ్జెట్‌ (Budget)లో ఏమీ లేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను వంచించేలా బీఆర్ఎస్‌ బడ్జెట్ ఉందని తప్పుబట్టారు. బీఆర్ఎస్‌ బడ్జెట్‌లో కేటాయింపులే తప్ప ఆచరణలో శూన్యమన్నారు. కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయని, చేతలు మాత్రం గడప దాటట్లేదని విమర్శించారు. కేంద్రం నిధులను డిజిటల్ సంతకాలతో కేసీఆర్ సర్కార్‌ తస్కరిస్తోందని ఆరోపించారు. పంచాయతీలకు నేరుగా నిధులిస్తామనడం హాస్యాస్పదమని సంజయ్‌ విమర్శించారు.

తెలంగాణ బడ్జెట్‌లో అంకెల గారడీ తప్ప ఏమీలేదు

తెలంగాణ బడ్జెట్‌ ( Telangana Budget)లో అంకెల గారడీ తప్ప ఏమీలేదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) దుయ్యబట్టారు. అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, రైతులకు ఇప్పటివరకూ రుణమాఫీ చేయడం లేదని ఈటల రాజేందర్ విమర్శించారు.

తెలంగాణ బడ్జెట్ వివరాలు

తెలంగాణ బడ్జెట్ రూ.2,90,396 కోట్లు

రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు

పెట్టుబడి వ్యయం రూ.37,525 కోట్లు

ఆర్ధిక శాఖకు రూ.49,749 కోట్లు

రెవెన్యూ శాఖకు రూ.3,560 కోట్లు

వ్యవసాయ శాఖకు రూ.26,831 కోట్లు

రోడ్లు, భవనాల శాఖకు రూ.2,500 కోట్లు

పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు

హోంశాఖకు రూ.9,599 కోట్లు

న్యాయశాఖకు రూ.1,665 కోట్లు

ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు

విద్యుత్ రంగానికి రూ.12,727 కోట్లు

ఆయిల్‌ ఫామ్‌కు రూ.వెయ్యి కోట్లు

దళిత బంధుకు రూ.17,700 కోట్లు

ఆసరా పెన్షన్లకు రూ.12 వేల కోట్లు

బీసీ సంక్షేమానికి రూ.6,229 కోట్లు

గిరిజన సంక్షేమం, ప్రత్యేక ప్రగతి నిధికి రూ.15,223 కోట్లు

నీటి పారుదల రంగానికి రూ.26,885 కోట్లు

కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలకు రూ.3,210 కోట్లు

పంచాయతీ రాజ్‌కు రూ.31,426 కోట్లు, రుణమాఫీకి రూ.6,385 కోట్లు

షెడ్యూల్ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి రూ,.36,750 కోట్లు

మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ.2,131 కోట్లు

మైనార్టీ సంక్షేమానికి రూ.2,200 కోట్లు

గ్రామీణ రోడ్లకు రూ.2 వేల కోట్లు

హరితహారం పథకానికి రూ.1,471 కోట్లు

మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్‌కు రూ.11,372 కోట్లు

రైతు బంధుకు రూ.15,075 కోట్లు, రైతు బీమాకు రూ.1,589 కోట్లు

వైద్యారోగ్య శాఖకు రూ.12,161 కోట్లు

విద్యా రంగానికి రూ.19,093 కోట్లు

కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌కు రూ.200 కోట్లు

పల్లె, పట్టణ ప్రగతికి రూ.4,834 కోట్లు

డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లకు రూ.12వేల కోట్లు

ఆరోగ్యశ్రీకి రూ.14,063 కోట్లు

ప్రభుత్వ ప్రకటనలకు రూ.వెయ్యి కోట్లు

మెట్రో రైల్ ప్రాజెక్ట్‌ కోసం రూ.1,500 కోట్లు

ఎయిర్‌పోర్టు మెట్రో కనెక్టివిటీ కోసం రూ.500 కోట్లు

ఓల్డ్‌ సిటీ మెట్రో కనెక్టివిటీ కోసం రూ.500 కోట్లు

యాదాద్రి ఆలయ అభివృద్ధికి రూ.500 కోట్లు

మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి రూ.200 కోట్లు

మహిళా వర్సిటీకి రూ.100 కోట్లు

ప్లానింగ్ విభాగానికి రూ.11,495 కోట్లు

ఐటీ కమ్యూనికేషన్ల శాఖకు రూ.366 కోట్లు

ఉన్నత విద్యకు రూ.3,001 కోట్లు, ఆర్టీసీకి రూ.1,500 కోట్లు

జర్నలిస్టుల సంక్షేమానికి రూ.100కోట్ల కార్పస్ ఫండ్

గొర్రెల పంపిణీకి రూ.100 కోట్లు

అటవీ కాలేజీల కోసం రూ.100 కోట్లు

కాళేశ్వరం టూరిజం సర్కిల్‌ కోసం రూ.750 కోట్లు

సుంకేసుల ఇన్‌టేక్ ప్రాజెక్ట్‌ కోసం రూ.725 కోట్లు

ఇంటిగ్రేటెడ్ మార్కట్లకు రూ.400 కోట్లు

వడ్డీ లేని రుణాల కోసం రూ.1,500 కోట్లు

Updated Date - 2023-02-06T18:40:08+05:30 IST