TSPSC paper leak: బండి సంజయ్, ఈటల రాజేందర్ అరెస్ట్
ABN , First Publish Date - 2023-03-17T16:55:45+05:30 IST
టీఎస్‌పీఎస్సీ పేపరు (లీకేజీ TSPSC paper leak) ఘటనపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. టీఎస్‌పీఎస్సీ ‘TSPSC) కార్యాలయం ముట్టడికి రాష్ట్ర బీజేపీ
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపరు (లీకేజీ TSPSC paper leak) ఘటనపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. టీఎస్‌పీఎస్సీ (TSPSC) కార్యాలయం ముట్టడికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Bandi Sanjay Etala Rajender)తో పాటు బీజేపీ నేతలు బయల్దేరారు. గన్‌పార్క్ దగ్గర రాగానే బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్ సహా పలువురిని అరెస్ట్ చేశారు. అరెస్టులను బీజేపీ నేతలు ప్రతిఘటించారు. ఈ క్రమంలో బీజేపీ (BJP) కార్యకర్తలు, పోలీసులు తోపులాట మధ్య తోపులాట జరిగింది. బండి సంజయ్, ఈటల రాజేందర్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీసుల వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. అసెంబ్లీ ముందు రోడ్డుపై బీజేపీ మహిళా కార్యకర్తలు బైఠాయించారు.
ఆందోళనల నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ముట్టడికి బయల్దేరారు. దీంతో గాంధీభవన్ గేట్లు మూసి బయటకు రాకుండా కార్యకర్తలను అడ్డుకున్నారు. అయిన కూడా గేట్లు దూకి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే వ్యవహారంపై ఆందోళనలకు పిలుపునిచ్చిన వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలను గృహనిర్బంధం చేశారు. కానీ ఆ వేడి మాత్రం ఇంకా చల్లారలేదు. విపక్ష పార్టీలు మాత్రం ఈ వ్యవహారంపై టీఎస్‌పీఎస్సీ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నాయి. అలాగే ఆందోళనలు కూడా ఉధృతం చేశాయి. ఈ కేసులో ఇప్పటికే నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు
గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను కూడా టీఎస్‌పీఎస్సీ (TSPSC) రద్దు చేసింది. ఇప్పటికే ఏఈ పరీక్ష (AE Exam) తో పాటు టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ ఎగ్జామ్ పేపర్లను రద్దు చేసింది. తాజాగా గ్రూప్-1 ప్రిలిమ్స్‌తో పాటు ఏఈఈ, డీఏవో పరీక్ష పేపర్లను కూడా రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి.