Tarakaratna: బాలకృష్ణ నిర్ణయించిన సమయానికే అంత్యక్రియలు: విజయసాయిరెడ్డి

ABN , First Publish Date - 2023-02-19T18:26:43+05:30 IST

తారకరత్న (Tarakaratna) భార్య, పిల్లల బాధ్యత తనదేనని ఎమ్మెల్యే బాలకృష్ణ (Balakrishna) మాటిచ్చారని ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy) తెలిపారు.

Tarakaratna: బాలకృష్ణ నిర్ణయించిన సమయానికే అంత్యక్రియలు: విజయసాయిరెడ్డి

హైదరాబాద్: తారకరత్న (Tarakaratna) భార్య, పిల్లల బాధ్యత తనదేనని ఎమ్మెల్యే బాలకృష్ణ (Balakrishna) మాటిచ్చారని ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy) వెల్లడించారు. బాలకృష్ణ నిర్ణయించిన సమయానికే అంతక్రియలు జరుగుతాయని ప్రెస్‌మీట్‌లో తెలిపారు. తారకరత్న మరణం ఎంతో బాధించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తారకరత్న అందరి మనసుల్లో నిలిచిపోతారని అన్నారు. ప్రతీ ఒక్కరిని అప్యాయంగా పలకరించే వ్యక్తి తారకరత్న అంటూ గుర్తుచేసుకున్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని అందరూ ఆశించారని, కానీ అలా జరగలేదన్నారు. రేపు అనగా సోమవారం మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు. రేపు ఉదయం 9 గంటలకు ఫిలిం ఛాంబర్‌ (Film Chamber)కు తారకరత్న భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్ధం తీసుకువస్తారని, మధ్యాహ్నం 3 గంటలకు తారకరత్న అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. బాలకృష్ణ నిర్ణయించిన సమయానికే అంత్యక్రియలు చేస్తామని విజయసాయిరెడ్డి ప్రకటించారు. కాగా శనివారం రాత్రి బెంగళూరు నుంచి తారకరత్న పార్థివదేహాన్ని హైదరాబాద్‌ (Hyderabad) శివారు ప్రాంతమైన మోకిలలోని నివాసానికి తీసుకువచ్చారు. భౌతికకాయాన్ని తెచ్చినప్పటి నుంచి విజయసాయి అక్కడే ఉన్నారు.

తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి మరెవరో కాదు విజయసాయిరెడ్డికి స్వయానా మరదలి కూతురు. విజయసాయిరెడ్డి భార్య, తారకరత్న అత్తయ్య అక్కాచెల్లెళ్లు కావడం గమనార్హం. తారకరత్న కొద్ది మంది సమక్షంలో హైదరాబాద్ నగర శివారులోని సంఘీ టెంపుల్‌లో అలేఖ్యా రెడ్డి (Alekhya Reddy)ని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తారకరత్నకు విజయసాయిరెడ్డి వరుసకు మామయ్య అవుతారు. ఈ బంధుత్వం ఉండటంతో తారకరత్న ఆసుపత్రిలో ఉన్న సమయంలో కూడా విజయసాయి రెడ్డి బెంగళూరు హృదయాలయకు వెళ్లి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు.

Tarakaratna: తారకరత్న నివాసానికి బాలకృష్ణ

Updated Date - 2023-02-19T18:46:09+05:30 IST