Attack On Bairi Naresh: బైరి నరేష్పై మరోసారి దాడి
ABN , First Publish Date - 2023-02-27T20:10:04+05:30 IST
జిల్లాలోని హనుమకొండలోని గోపాల్ పూర్ ప్రాంతంలో నాస్తికుడు బైరి నరేష్ (Bairi Naresh)పై అయ్యప్ప భక్తులు దాడి చేశారు.
వరంగల్: జిల్లాలోని హనుమకొండలోని గోపాల్ పూర్ ప్రాంతంలో నాస్తికుడు బైరి నరేష్ (Bairi Naresh)పై అయ్యప్ప భక్తులు దాడి చేశారు. నరేష్ను విచక్షణా రహితంగా హిందూ సంఘాల నేతలు కొట్టినట్లు తెలిసింది. విషయం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. దాడి ఘటనకు గల కారణాలను అడిగితెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇటీవల అయ్యప్ప స్వామిపై మరోసారి బైరి నరేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో హిందుత్వ వాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది. పోలీస్ వెహికల్ లో ప్రొటెక్షన్ తో వెళ్తున్న నరేష్ ని కిందకు లాగి తీవ్రంగా దాడికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.
కాగా గతంలో అయ్యప్ప స్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలుకెళ్లాడు భైరి నరేష్. జైలు నుంచి బయటకు వచ్చాక మరోసారి వివాస్పద వాఖ్యలు చేశాడు నరేష్. తీరు మార్చుకోకుండా నేనింతే అన్నట్టు వ్యవహరిస్తున్నాడన్న ఆగ్రహంతో దాడి చేసినట్లు అయ్యప్ప భక్తులు అంటున్నారు. దాడి అనంతరం భైరి నరేష్ మాట్లాడారు. నాపై దాడి చేస్తారనే పోలీసులను రక్షణ అడిగానన్నారు. పోలీసులు వాహనంలో ఉండగానే నాపై దాడి చేశారన్నారు. ప్రభుత్వం తనకు రక్షణ కల్పించాలని కోరారు. నాకు గన్ లైసెన్స్ కావాలని భైరి నరేష్ కోరారు. పోలీసుల వానహంలో వెళ్తుంటే వెంబడించి దాడి చేశారని వాపోయారు.
ఇటీవల బెయిల్
దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్ కి ఇటీవల బెయిల్ మంజూరు అయింది. చర్లపల్లి జైలు నుంచి భైరి నరేష్ బెయిల్ పై విడుదల అయ్యారు. భైరి నరేష్ కు కోడంగల్ కోర్టు షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దాదాపు 45 రోజుల పాటు నరేష్ జైల్లో ఉండి ఫిబ్రవరి 16న విడుదలయ్యారు. హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌కి కోడంగల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కొడంగల్ కోర్టు తెలిపింది. దాదాపు 45 రోజుల పాటు జైలులో ఉన్న నరేష్ను చర్లపల్లి జైలు నుంచి పోలీసులు విడుదల చేశారు. అయ్యప్ప స్వాములపై భైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. భైరి నరేష్ వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప స్వామి భక్తులు, హిందూ సంఘాలు నిరసనకు దిగాయి. అతడిపై రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కొడంగల్ పోలీసులు భైరి నరేష్‌తో పాటు అంబేడ్కర్ జాతర కార్యక్రమ నిర్వాహకుడు డోలు హనుమంతును ఇటీవల అరెస్టు చేశారు.
దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు
గత ఏడాది డిసెంబర్ నెలఖారులో కొడంగల్‌లో నిర్వహించిన అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో అయ్యప్పస్వామిపై భైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయ్యప్ప నువ్వు నా కొంప ముంచావంటూ బహిరంగ సభలో అయ్యప్పస్వామిని కించపరుస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. దీంతో అతడిపై హిందూ సంఘాలు, అయ్యప్ప మాలధారుల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అయ్యప్ప మాలధారులు ఆందోళనలు చేపట్టి భైరి నరేష్ పై ఫిర్యాదు చేశారు. దీంతో అనేక పోలీస్ స్టేషన్‌లలో భైరి నరేష్ పై కేసులు నమోదు అయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి పరారీలో ఉన్న భైరి నరేష్‌ను రెండ్రోజుల తర్వాత అరెస్ట్ చేశారు. కరీంనగర్ వెళ్తుండగా వరంగల్‌లో అతడిని అరెస్టు చేశారు.