Y.Srinivas Reddy: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఉద్యమ కారులను అణిచివేస్తున్నారు
ABN , First Publish Date - 2023-11-20T21:54:18+05:30 IST
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వారంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ( Yennam Srinivas Reddy ) అన్నారు.

మహబూబ్‌నగర్: తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వారంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ( Yennam Srinivas Reddy ) అన్నారు. మహబూబ్‌నగర్ సోమవారం నాడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ..‘‘ బీఆర్ఎస్ పార్టీ స్థాపించింది మేము.. ఇక్కడ ఉద్యమం చేసింది మేము.. కానీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఇక్కడికి వచ్చి.. ఉద్యమ కారులను అణిచివేస్తున్నారు.మేము అప్పుడు ఉద్యమం చేసిన వారిని సముచితంగా గౌరవిస్తాం’’ అని యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.