KCR : కేసీఆర్ ప్రయాణిస్తున్నహెలికాఫ్టర్‌లో సడెన్‌గా సాంకేతిక లోపం.. తర్వాత ఏం జరిగిందంటే..
ABN , First Publish Date - 2023-11-06T13:32:10+05:30 IST
సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఆయన ఎన్నికల ప్రచారం నిమిత్తం మహబూబ్‌నగర్ దేవరకద్రకు బయలుదేరారు. అయితే మార్గమధ్యలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ అప్రమత్తమయ్యారు.
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఆయన ఎన్నికల ప్రచారం నిమిత్తం మహబూబ్‌నగర్ దేవరకద్రకు బయలుదేరారు. అయితే మార్గమధ్యలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ అప్రమత్తమయ్యారు. వెంటనే తిరిగి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి హెలికాఫ్టర్‌ను మళ్లించారు. సురక్షితంగా ల్యాండ్ చేశారు. సీఎం కేసీఆర్ పర్యటన కోసం మరో హెలికాఫ్టర్‌ను ఏవియేషన్ అధికారులు సిద్దం చేస్తున్నారు. మరో హెలికాఫ్టర్ రాగానే పర్యటనను కేసీఆర్ కొనసాగించనున్నారు.