TS News : కేసీఆర్ చెబుతున్నవన్నీ అబద్ధాలేనన్న కర్ణాటక మంత్రి మునియప్ప
ABN , First Publish Date - 2023-11-20T13:42:16+05:30 IST
తమ రాష్ట్రంలో ఐదు గ్యారంటీలు ఇస్తున్నామని.. అయితే తాము ఇవ్వడం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతున్నవన్నీ అబద్ధాలేనని కర్ణాటక మంత్రి మునియప్ప తెలిపారు.
హైదరాబాద్ : తమ రాష్ట్రంలో ఐదు గ్యారంటీలు ఇస్తున్నామని.. అయితే తాము ఇవ్వడం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతున్నవన్నీ అబద్ధాలేనని కర్ణాటక మంత్రి మునియప్ప తెలిపారు. నేడు ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో మొదటిసారి గృహలక్ష్మి పథకాన్ని కర్ణాటకలో ప్రవేశపెట్టామన్నారు. కేసీఆర్ పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. ప్రధాని మోదీకి దళిత వర్గాలకి ఏమైనా మంచి చేయాలని ఉంటే ముందు ఆర్డినెన్స్ చేసి పార్లమెంట్‌కి తీసుకురావాలన్నారు. అక్కడ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందని మునియప్ప తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ చెప్పేవి చేస్తుందన్నారు. కర్ణాటకలో చెప్పింది వంద రోజులోనే అమలు చేశామని మునియప్ప తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తోందన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ని ఆదరించాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజశేఖర్ ఉన్నపుడు అభివృద్ధి ఎట్లా జరిగిందో మీకు తెలుసని పేర్కొన్నారు. కేసీఆర్ పాలన అంతా అవినీతిమయమని మునియప్ప విమర్శిచారు.