Delhi liquor case: ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం...

ABN , First Publish Date - 2023-09-13T19:23:53+05:30 IST

దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi liquor scam case) మరో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లై (Arun Ramachandra Pillai) అప్రూవర్‌గా మారారు. ఈ మేరకు 164 కింద ఈడీ అధికారులకు ఆయన వాంగ్మూలం ఇచ్చారు.

Delhi liquor case: ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం...

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi liquor scam case) మరో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లై (Arun Ramachandra Pillai) అప్రూవర్‌గా మారారు. ఈ మేరకు 164 కింద ఈడీ అధికారులకు ఆయన వాంగ్మూలం ఇచ్చారు. దీంతో పిళ్ళై దగ్గర నుంచి ఈడీ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. ఇదిలావుండగా బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) బినామీగా అరుణ్ రామచంద్రన్ పిళ్ళైపై దర్యాప్తు సంస్థలు అభియోగాలు మోపాయి.


ఈ కేసులో ఇప్పటికే సౌత్ గ్రూపులోని పలువురు సభ్యులు అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. అప్రూవర్స్‌గా మారిన వారిలో అరుణ్ రామచంద్ర పిళ్ళైతోపాటు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి ఉన్నారు. కాగా అప్రూవర్స్ ఇచ్చిన సమాచారం ఆధారంగా లిక్కర్ కేసులో కొత్త అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉందనే విశ్లేషణలున్నాయి. రానున్న కొద్ది రోజుల్లో ఢిల్లీ లిక్కర్ కేసులో మరికొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

కాగా ప్రస్తుతం అప్రూవర్‌గా మారిన అరుణ్ రామచంద్ర పిళ్లై ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక వ్యక్తిగా ఉన్నారు. దీంతో మార్చి 7న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించింది. పలు దఫాలుగా రామచంద్ర పిళ్లై ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-09-13T19:23:53+05:30 IST