TSPSC paper leak case: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో మరో 10 మంది అరెస్ట్‌

ABN , First Publish Date - 2023-07-10T21:52:52+05:30 IST

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో (TSPSC paper leak case) మరో 10 మందిని సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో 74 మంది అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు అరెస్టులను కొనసాగిస్తున్నారు.

TSPSC paper leak case: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో మరో 10 మంది అరెస్ట్‌

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో (TSPSC paper leak case) మరో 10 మందిని సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో 74 మంది అరెస్టయిన విషయం తెలిసిందే. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. మరికొంతమందిని అరెస్టు చేసేందుకు 5 ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. కాగా టీఎస్‌పీఎస్సీ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసుపై సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది.

Updated Date - 2023-07-10T21:52:52+05:30 IST