Amit Shah: 27న ఖమ్మంలో అమిత్‌షా పర్యటన..

ABN , First Publish Date - 2023-08-25T11:59:04+05:30 IST

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఖమ్మం పర్యటన ఈనెల 27న జరగనుంది. ఈమేరకు ఆయన పర్యటన విరాలను హోంశాఖ

Amit Shah: 27న ఖమ్మంలో అమిత్‌షా పర్యటన..

ఖమ్మం: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఖమ్మం పర్యటన ఈనెల 27న జరగనుంది. ఈమేరకు ఆయన పర్యటన విరాలను హోంశాఖ కార్యాల యం గురువారం రాత్రి విడుదల చేసింది. ఈనెల 27న ఉదయం 11గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1:25కు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి మధ్యాహ్నం 2:15గంటలకు భధ్రాచలం చేరుకుంటారు. 2:25గంటలకు రామయ్య దర్శనం అనంతరం అనంతరం 2:50కు హెలికాప్టర్‌లో బయల్దేరి.. 3:30కు ఖమ్మం సర్దార్‌ పటేల్‌ స్టేడియంలోని హెలిపాడ్‌కు చేరుకుని.. ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. సాయంత్రం 5:50 సభ ముగించుకుని హెలికాప్టర్‌లో విజయవాడ విమానాశ్రయానికి చేరుకుని.. ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు.

Updated Date - 2023-08-25T11:59:33+05:30 IST