Adilabad: బాలికలకు కోచ్ లైంగిక వేధింపులు..స్పోర్ట్ కోచ్ సస్పెండ్..
ABN , First Publish Date - 2023-03-19T11:44:53+05:30 IST
జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని స్పోర్ట్స్ స్కూల్లో(Sports School) ఇద్దరు బాలికలను

ఆదిలాబాద్: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని స్పోర్ట్స్ స్కూల్లో(Sports School) ఇద్దరు బాలికలను(Two girls) కోచ్ రవీందర్(Coach Ravinder) లైంగికంగా వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత కొన్ని రోజుల నుంచి బాలికలు ఏదో తెలియని బాధగా ఉన్నట్లు గమనించిన తల్లిదండ్రులు బాలికలను గట్టిగా నిలదీయడంతో అసలు విషయాన్ని బాలికలు తల్లిదండ్రులకు చెప్పారు. కోచ్ రవీందర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కోచ్ ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. కోచ్‌పై క్రిమినల్ కేసులు నమోదుకు ఆదేశించారు.