WhatsApp Update: స్నాప్‌చాట్ తరహాలోనే వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. కానీ, అదొక్కటే సమస్య!

ABN , First Publish Date - 2023-07-28T18:31:53+05:30 IST

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలోనే ఒక సరికొత్త ఫీచర్‌ని తీసుకురానుంది. వాయిస్ నోట్స్ తరహాలోనే ఇన్‌స్టంట్ వీడియో మెసేజ్ ఫీచర్‌ని తీసుకొస్తోంది. కొన్ని రోజుల్లోనే...

WhatsApp Update: స్నాప్‌చాట్ తరహాలోనే వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. కానీ, అదొక్కటే సమస్య!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలోనే ఒక సరికొత్త ఫీచర్‌ని తీసుకురానుంది. వాయిస్ నోట్స్ తరహాలోనే ఇన్‌స్టంట్ వీడియో మెసేజ్ ఫీచర్‌ని తీసుకొస్తోంది. కొన్ని రోజుల్లోనే ఓవర్-ద-ఎయిర్ (OTA) అప్డేట్‌తో ఈ ఫీచర్‌ని తాము అందుబాటులోకి తీసుకురానున్నట్టు మెటా సంస్థ ప్రకటించింది. ఈ ఫీచర్ చాలా సరదాగా ఉంటుందని, వాయిస్ నోట్స్ తరహాలోనే యూజర్లు మెరుగ్గా కనెక్ట్ అవ్వడంలో ఇది సహాయపడుతుందని పేర్కొంది. ఈ ఫీచర్ స్నాప్‌చాట్ ఇన్‌స్టంట్ వీడియో మెసేజ్ మాదిరిగానే ఉంటుంది. అయితే.. స్నాప్‌చాట్‌లో మెసేజ్ తెరిచిన వెంటనే ఆటోమెటిక్‌గా డిలీట్ అవుతుంది. కానీ.. వాట్సాప్‌లో అలా కాదు.

అయితే.. ఈ కొత్త ఫీచర్‌లో ఒక చిన్న తిరకాసు ఉంది. కేవలం 60 సెకన్ల వరకే వీడియోని రికార్డ్ చేసి, మెసేజ్ పంపడానికి వీలుగా ఉంటుంది. అంతకుమించి ఎక్కువ సమయం రికార్డ్ చేయడానికి వీలు లేదు. సోది లేకుండా సూటిగా ఏదైనా మేటర్‌ని చెప్పడం కోసమే, ఇలా 60 సెకన్ల నిడివితో తాము ఈ కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చామని సంస్థ వివరణ ఇచ్చింది. యూజర్లు తమ ఎమోషన్స్ షేర్ చేసుకోవడానికి కూడా ఈ ఫీచర్ దోహదపడుతుందని మెటా సంస్థ తెలిపింది. వాయిస్ నోట్స్ ఫీచర్ ఎక్కడైతే ఉందో, అక్కడే ఇది కూడా ఉంటుంది. వాయిస్ నోట్స్ ఫీచర్‌పై క్లిక్ చేసినప్పుడు.. అక్కడ ఆడియో, వీడియో ఆప్షన్స్ కనిపిస్తాయి. అప్పుడు వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని.. ఇన్‌స్టంట్ వీడియో మెసేజ్ పంపుకోవచ్చు.


మరో సౌకర్యం ఏమిటంటే.. వాయిస్ నోట్స్ ఫీచర్ ఎలాగైతే హ్యాండ్స్-ఫ్రీగా పని చేస్తుందో, ఈ ఫీచర్ కూడా అలాగే పని చేస్తుంది. వీడియో ఆప్షన్‌ని పైకి స్వైప్ చేసి, ఏదైనా ఒక చోట ఫోన్ అమర్చి, వీడియోని రికార్డ్ చేయొచ్చు. బటన్‌ని నొక్కి ఉంచాల్సిన అవసరం ఉండదు. కానీ.. ఈ కొత్త ఫీచర్‌లో ఒక చిన్న లోటు ఉంది. వాయిస్ నోట్స్ తరహాలో, దీనికి ప్లేబ్యాక్ స్పీడ్ ఆప్షన్ ఉండదు. మొదటి నుంచి చివరిదాకా మొత్తం వీడియో చూడాల్సి ఉంటుంది. ఇది యూజర్లను కాస్త ఇబ్బంది పెట్టవచ్చు.

Updated Date - 2023-07-28T18:31:53+05:30 IST