Elon Musk: ట్వీట్టర్ యూజర్లకు షాక్ ఇచ్చిన ఎలాన్ మస్క్

ABN , First Publish Date - 2023-05-09T16:49:02+05:30 IST

ట్వీట్టర్ యూజర్లకు (Twitter users) సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్వీట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (Twitter CEO Elon Musk) ఎలాన్ మస్క్ షాక్ ఇచ్చారు.

Elon Musk: ట్వీట్టర్ యూజర్లకు షాక్ ఇచ్చిన ఎలాన్ మస్క్

హైదరాబాద్: ట్వీట్టర్ యూజర్లకు (Twitter users) సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్వీట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (Twitter CEO Elon Musk) ఎలాన్ మస్క్ షాక్ ఇచ్చారు. అనేక సంవత్సరాల నుంచి ఉపయోగించని తమ కస్టమర్ల ట్వీట్టర్ ఖాతాలను తొలగిస్తున్నట్లు మస్క్ ప్రకటించారు. ఉయోగించని ఖాతాలను ఆర్కైవ్ చేయబడతాయని, ఈ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై ట్వీట్టర్ యజమాని మస్క్ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.

ట్విట్టర్ వినియోగదారులు ఆర్కైవ్ చేసిన ఖాతాలను ఎలా పునరుద్ధరించుకోవాలనేదానిపై కూడా స్పష్టమైన వివరాలను తెలపలేదు. ట్వీట్టర్ పాలసీ ప్రకారం వినియోగదారులు ఎక్కువ కాలం నుంచి వాడని ఖాతాలను శాశ్వత తొలగింపును నివారించడానికి కనీసం 30 రోజులకు ఒకసారి వారి ఖాతాను లాగిన్ చేయాలని సూచనలు చేశారు. సెలబ్రిటీలు, జర్నలిస్టులు, ప్రముఖ రాజకీయ నాయకులతో సహా వేలాది మంది వ్యక్తుల ప్రొఫైల్ నుంచి లెగసీ వెరిఫైడ్ బ్లూ టిక్‌ను ట్విట్టర్ గత నెలలో తొలగించిన సంగతి తెలిసిందే.

Updated Date - 2023-05-09T17:41:27+05:30 IST