Samsung: 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో గెలాక్సీ M-సిరీస్ 5జీ స్మార్ట్‌ఫోన్.. ధరెంతంటే..

ABN , First Publish Date - 2023-07-07T17:06:23+05:30 IST

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల (Smartphones) తయారీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు తమ ఉత్పత్తులను మార్కెట్‌లో ప్రవేశపెడుతోంది.

Samsung: 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో గెలాక్సీ M-సిరీస్ 5జీ స్మార్ట్‌ఫోన్.. ధరెంతంటే..

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల (Smartphones) తయారీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు తమ ఉత్పత్తులను మార్కెట్‌లో ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ (Samsung Galaxy M34 5G) స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లో విడుదల చేసింది. అమెజాన్, శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా జూలై 15 నుంచి అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. 8జీబీ ర్యామ్ వేరియంట్ శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ ఫోన్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ సమయంలో అందుబాటులో ఉంటుంది.

ఇండియా మార్కెట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ స్మార్ట్‌ఫోన్ల ధరలు ఇలా ఉన్నాయి. 6జీబీ ర్యామ్‌తోపాటు 128జీబీ స్టోరేజ్ వేరియంట్ శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ స్మార్ట్‌ఫోన్ రూ. 16,999, 8జీబీ ర్యామ్‌తోపాటు 128జీబీ స్టోరేజ్ మోడల్ గెలాక్సీ ఎం34 5జీ స్మార్ట్‌ఫోన్ రూ. 18,999 ఉంటుంది.

Updated Date - 2023-07-07T17:10:38+05:30 IST