Samsung: కొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 స్మార్ట్‌ఫోన్స్.. ధర ఎంతంటే..

ABN , First Publish Date - 2023-07-12T17:00:03+05:30 IST

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడు తమ ఉత్పత్తులను మార్కెట్‌లో విడుదల చేస్తోంది.

Samsung: కొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 స్మార్ట్‌ఫోన్స్.. ధర ఎంతంటే..

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడు తమ ఉత్పత్తులను మార్కెట్‌లో విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా కొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ (Samsung Galaxy Z Fold 5 and Galaxy Z Flip 5) స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రపంచ మార్కెట్‌లో జూలై 26న శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. సియోల్‌లో జరగనున్న ఈవెంట్‌లో శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్9, గెలాక్సీ వాచ్ 6 సిరీస్‌ను విడుదల చేయనున్నట్లు సంస్త తెలిపింది.


అయితే భారత మార్కెట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఫోన్లను విడుదల చేసిన వెంటనే.. ప్రీ-ఆర్డర్స్ ప్రారంభమవుతాయని సంస్థ తెలిపింది. ఆగస్టు 14 నుంచి గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు ప్రారంభంకానున్నాయి.


హ్యాండ్‌సెట్‌లను ముందుగా రిజర్వ్ చేసుకున్న రూ. 5,000 వరకు ప్రయోజనాలు అందుతాయని సంస్త తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న శాంసంగ్.కామ్. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ ప్రత్యేక స్టోర్లలో రూ. 1,999 ప్రీ-రిజర్వేషన్ చేసుకున్న కస్టమర్లకు ఫోన్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.


256జీబీ వేరియంట్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 స్మార్ట్‌ఫోన్ రూ. 1,72,400 ఉంటుంది. 512జీబీ అండ్ 1టీబీ వేరియంట్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 ఫోన్ రూ. 1,85,100 నుంచి రూ. 2,06,900 వరకు ఉంటుంది.

Updated Date - 2023-07-12T17:03:02+05:30 IST