Samsung: బిగ్ టీవీ డేస్ సేల్ పేరుతో భారీ ఆఫర్లను ప్రకటించిన శాంసంగ్

ABN , First Publish Date - 2023-06-15T20:56:39+05:30 IST

శాంసంగ్ (Samsung) బిగ్ టీవీ డేస్ సేల్ పేరుతో భారీ ఆఫర్లను ప్రకటించింది.

Samsung: బిగ్ టీవీ డేస్ సేల్ పేరుతో భారీ ఆఫర్లను ప్రకటించిన శాంసంగ్

హైదరాబాద్: శాంసంగ్ (Samsung) బిగ్ టీవీ డేస్ సేల్ పేరుతో భారీ ఆఫర్లను ప్రకటించింది. స్మార్ట్‌టీవీలు, గెలాక్సీ ఎస్23 అల్ట్రా, ఫ్రీస్టైల్ ప్రొజెక్టర్, సౌండ్‌బార్లు, పోర్టబుల్ ప్రొజెక్టర్ ఆఫర్‌లో ఉన్నాయి. జూలై 25 వరకు ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. బిగ్ టీవీ డేస్ 2023 సేల్‌లో పెద్ద సంఖ్యలో టీవీలపై డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు సంస్థ తెలిపింది. నియో క్యూఎల్ఈడీ 8కే, ఓఎల్ఈడీ, క్యూఎల్ఈడీ, క్రిస్టల్ 4కే యూహెచ్‌డీ టీవీ సిరీస్ మోడళ్లపై ఈ ఆఫర్ ఉంటుంది.

బిగ్ టీవీ డేస్ సేల్ జూన్ 15 నుంచి జూలై 25, 2023 వరకు కొనసాగుతుంది. ఎంపిక చేసిన పెద టీవీలపై 20 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు శాంసంగ్ తెలిపింది.

98-అంగుళాల నియో క్యూఓఎల్ఈడీ లేదా 98-అంగుళాల క్యూఎల్ఈడీ టీవీ మోడల్‌ను కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ. 1,24,999 విలువ గల గెలాక్సీ ఎస్23 అల్ట్రా లభించనుంది. ఎంపిక చేసిన 75-అంగుళాల నియో క్యూఎల్ఈడీ టీవీలు కొనుగోలు చేస్తే రూ. 69,990 విలువ గల పోర్టబుల్ ప్రొజెక్టర్ లభించనుంది. 55-అంగుళాల టీవీలను కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ. 51,990 విలువ గల సౌండ్‌బార్లను కంపెనీ అందిస్తోంది.

Updated Date - 2023-06-15T21:13:20+05:30 IST