Redmi Note 12: ఎంతగానో ఎదురుచూస్తున్న రెడ్‌మీ నోట్ 12 సిరీస్ ఫోన్లు వచ్చేశాయ్

ABN , First Publish Date - 2023-01-05T19:53:02+05:30 IST

స్మార్ట్‌ఫోన్ (SmartPhone) ప్రియులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రెడ్‌మీ నోట్ 12 సిరీస్ (Redmi Note 12 Series) ఫోన్లు భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. మూడు మోడల్ ఫోన్లను కంపెనీ ఆవిష్కరించింది.

Redmi Note 12: ఎంతగానో ఎదురుచూస్తున్న రెడ్‌మీ నోట్ 12 సిరీస్ ఫోన్లు వచ్చేశాయ్

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ (SmartPhone) ప్రియులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రెడ్‌మీ నోట్ 12 సిరీస్ (Redmi Note 12 Series) ఫోన్లు భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. మూడు మోడల్ ఫోన్లను కంపెనీ ఆవిష్కరించింది. ఎమోఎల్‌ఈడీ డిస్‌ప్లేస్‌లు (AMOLED displays), పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ చిప్‌సెట్, ఐపీ53 రేటెడ్ వంటి కొత్త ఫీచర్లు ఈ ఫోన్లలో ఉన్నాయి. ఈ ఫోన్ల రేట్లు, ఇతర ఫీచర్లు ఏవిధంగా ఉన్నాయో ఓ లుక్కేద్దాం..

రెడ్‌మీ నోట్ 12 సిరీస్ ప్రత్యేకతలు..

రెడ్‌మీ నోట్ 12 (Redmi note 12) 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ మోడల్ ఫోన్ ధర రూ.15,499గా ఉంది. ఇక రెడ్‌మీ నోట్ 12 ప్రో (Redmi note 12 Pro) వెర్షన్ ఫోన్ రేటు రూ.20,999 గా కంపెనీ పేర్కొంది. అయితే హై-ఎండ్ రెడ్‌మీ నోట్ 12 ప్రో+ (Redmi note 12 Pro+) మోడల్ ఫోన్ల ప్రారంభ ధర భారత్‌లో రూ.25,999 నుంచి మొదలుకానుంది. 2023కు చెందిన ఈ కొత్త 5జీ ఫోన్లు ఎంఐడాట్‌కామ్ (Mi.com), ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌పై అమ్మకానికి అందుబాటులో ఉండనున్నట్టు కంపెనీ పేర్కొంది.

ఈ ఫోన్ల కొత్త ఫీచర్ల విషయానికి వస్తే.. 120 హెడ్జ్ రిఫ్రెష్‌ రేటుతో ఎమోఎల్‌ఈడీ డిస్‌ప్లేస్‌లతో వచ్చాయి. ఫోన్లు అన్నీ ఆండ్రాయిడ్ 12తో తయారు చేశారు. రెండేళ్లవరకు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌‌గ్రేడ్ ఉంటుందని, నాలుగేళ్లవరకు సెక్యూరిటీ ప్యాచెస్ ఉంటాయని కంపెనీ తెలిపింది. ధరను బట్టి ప్రీమియం ఫీచర్లలో కొన్ని మార్పులు ఉంటాయి. రెడ్‌మీ నోట్ 12 సిరీస్ మోడల్ ఫోన్ 120 హెర్జ్ రిఫ్రెష్ రేటుతో 6.67 - ఇంచ్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే, 240 హెర్జ్ టచ్ శాంప్లింగ్ రేటు, డీసీఐ-పీ3 కలర్ గముట్ ఫీచర్లు ప్రధానమైనవి. హయ్యర్ మోడల్ సిరీస్.. హెచ్‌డీఆర్10+ సపోర్టుతో స్ర్కీన్, డల్బీ విజన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో ఫోన్లు రానున్నాయి. రెడ్‌మీ నోట్ 12 5జీ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 1 చిప్‌సెట్‌తో రానుంది. రెడ్‌మీ 12 ప్రో, రెడ్‌మీ 12 ప్రో+ మోడళ్లు మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్‌సెట్ ఫీచర్‌తో రానున్నాయి.

Updated Date - 2023-01-05T19:57:05+05:30 IST