Redmi: కొత్త ఫీచర్లతో రెడ్‌మి 12 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్..

ABN , First Publish Date - 2023-06-17T20:54:49+05:30 IST

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రెడ్‌మి (Redmi) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో కొత్త మోడల్ 4జీ ఫోన్లను విడుదల చేసింది.

Redmi: కొత్త ఫీచర్లతో రెడ్‌మి 12 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్..

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రెడ్‌మి (Redmi) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో కొత్త మోడల్ 4జీ ఫోన్లను విడుదల చేసింది. ప్రపంచ మార్కెట్‌లో రెడ్‌మి 12 స్మార్ట్‌ఫోన్‌ను (Smartphone) విడుదల చేసినట్లు కంపెనీ తెలిపింది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రెడ్‌మి 12 స్మార్ట్‌ఫోన్‌ రూ. 17,000 లభించనుంది.

రెడ్‌మి 12 ఫీచర్స్ ఇలా ఉన్నాయి.

డ్యూయల్-సిమ్ (నానో+మైక్రో ఎస్డీ స్లాట్) రెడ్‌మి 12 ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14తో పని చేస్తోంది. 6.79-పూర్తి- హెచ్‌డీ డిస్‌ప్లే, వినియోగదారులు వేగాన్ని పొందడానికి అదనపు ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ని ఉపయోగించి ఇన్‌బిల్ట్ ర్యామ్‌ను వర్చువల్‌గా 16జీబీ వరకు విస్తరించవచ్చు.

Updated Date - 2023-06-17T20:55:13+05:30 IST