Realme: అమ్మకాల్లో దూసుకెళ్తున్న రియల్‌మి 11 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్.. ఒక్కరోజులోనే..

ABN , First Publish Date - 2023-06-17T17:17:08+05:30 IST

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మి (Realme) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో కొత్త ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది.

Realme: అమ్మకాల్లో దూసుకెళ్తున్న రియల్‌మి 11 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్.. ఒక్కరోజులోనే..

హైదరాబాద్: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మి (Realme) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో కొత్త ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. జూన్ 15న రియల్‌మి 11 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు చేపట్టగా.. ఒక్క రోజులోనే 60 వేల యూనిట్లు అమ్ముడుపోయినట్లు రియల్‌మి కంపెనీ ప్రకటించింది.

ఫోన్ల విక్రయాల్లో ఇదొక కొత్త మైలురాయి అని కంపెనీ తెలిపింది. కంపెనీ అత్యధిక మొదటి-సేల్స్ రికార్డును బద్దలు కొట్టినట్లు పేర్కొంది. భారత మార్కెట్‌లో రియల్‌మి 11 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రూ. 23,999 ఉంటుంది.

రియల్‌మి 11 ప్రో+ 5జీకి దేశంలో అద్భుతమైన స్పందన వచ్చిందని, ఒక రోజులో 60,000 యూనిట్లకు పైగా విక్రయించినట్లు ట్విట్టర్ ద్వారా రియల్‌మి ప్రకటించింది. జూన్ 15న ఫ్లిప్‌కార్ట్ (Flipkart), రియల్‌మి.కామ్ ద్వారా ఫోన్ల విక్రయాలు చేపట్టింది.

REAL.jpg

రియల్‌మి 11 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి.

5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 200- మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా, ఆమోల్డ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెమెన్సిటీ 7050 ఎస్‌వోసీ ఉంటుంది. 100డబ్ల్యూ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 200 మెగాపిక్సెల్ శాంసంగ్ హెచ్‌పీ3 ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 32 మెగాపిక్సెల్ సెల్పీ కెమెరా, 12జీబీ ర్యామ్ ఉంటుంది.

Updated Date - 2023-06-17T17:25:22+05:30 IST