Share News

Realme GT 5 Pro: కొత్త ఫీచర్లతో రియల్‌మి జీటీ సిరీస్ స్మార్ట్‌ఫోన్స్..

ABN , First Publish Date - 2023-11-07T16:45:35+05:30 IST

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మి తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో కొత్త మోడల్‌ స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది.

Realme GT 5 Pro: కొత్త ఫీచర్లతో రియల్‌మి జీటీ సిరీస్ స్మార్ట్‌ఫోన్స్..

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మి తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో కొత్త మోడల్‌ స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా రియల్‌మి జీటీ 5 ప్రో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్త జీటీ సిరీస్ స్మార్ట్‌ఫోన్లను చైనా మార్కెట్‌లో ప్రవేపెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్లకు సంబంధించి ప్రస్తుతం టీజర్ విడుదలై కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఫోన్ల విడుదల తేదీలను మాత్రం సంస్థ ఇంకా ప్రకటించలేదు. 16జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ, 512జీబీ, 1టీబీ స్టోరేజ్ సదుపాయం ఉంటుంది.

Updated Date - 2023-11-07T16:46:18+05:30 IST