Share News

Realme: కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా..? రియల్‌మీ నుంచి మరో కొత్త మోడల్.. ధర ఎంతంటే..!

ABN , First Publish Date - 2023-11-21T16:52:05+05:30 IST

భారత్‌లో రియల్ మీ ఫోన్లకు మంచి ఆదరణ ఉంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో రియల్ మీ అందించే బడ్జెట్ ఫోన్లను చాలా మంది ఇష్టపడుతుంటారు. రియల్ మీ త్వరలోనే సీ-సిరీస్‌లో ఓ కొత్త మొబైల్‌ను లాంఛ్ చేయబోతోంది. త్వరలోనే Realme C65 5G ఫోన్ భారత మార్కెట్లోకి విడుదల కాబోతోంది.

Realme: కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా..? రియల్‌మీ నుంచి మరో కొత్త మోడల్.. ధర ఎంతంటే..!

భారత్‌లో రియల్ మీ (Realme) ఫోన్లకు మంచి ఆదరణ ఉంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో రియల్ మీ అందించే బడ్జెట్ ఫోన్లను చాలా మంది ఇష్టపడుతుంటారు. రియల్ మీ త్వరలోనే సీ-సిరీస్‌లో ఓ కొత్త మొబైల్‌ను లాంఛ్ చేయబోతోంది. త్వరలోనే Realme C65 5G ఫోన్ భారత మార్కెట్లోకి విడుదల కాబోతోంది. ఈ ఫోన్ గురించి కంపెనీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన ఏదీ రాకపోయినప్పటికీ చాలా లీక్‌లు మాత్రం బయటకు వస్తున్నాయి. తాజా అప్‌డేట్‌లో ఫోన్ ధర (Price), స్పెసిఫికేషన్‌లు (Specification) వెల్లడయ్యాయి.

భారతదేశంలో సీ-సిరీస్‌లో Realme C65 5G మొదటి 5G స్మార్ట్‌ఫోన్ అని చెప్పవచ్చు. ఈ మొబైల్ మూడే వేరియంట్లలో అందుబాటులోకి రాబోతోంది. వచ్చే వారంలో విడుదల కాబోతున్న ఈ మొబైల్ ధర రూ.12 వేల నుంచి 15 వేల మధ్యలో ఉండొచ్చని అంచనా. 4GB, 6GB, 8GB వేరియంట్లలో ఈ మొబైల్ అందుబాటులో ఉండనుంది. 64GB నుంచి 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఆఫర్ చేస్తోంది. గ్రీన్, పర్పుల్ కలర్స్‌లో ఈ మొబైల్ అందుబాటులో ఉండొచ్చు (Realme C65 5G Price).

Funny Video: నెట్టింట నవ్వులు పూయిస్తున్న తాత వీడియో.. గేట్లు తీసే ఉన్నా కూడా ఏం చేశాడో చూస్తే..!

రియల్ మీ కంపెనీ సెప్టెంబర్‌లో Realme C51ని విడుదల చేసింది. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ ధర రూ.8,999గా కంపెనీ నిర్ణయించింది. 6.7-అంగుళాల IPS LCS డిస్‌ప్లేతో 90Hz రిఫ్రెష్ రేట్‌తో ఈ మొబైల్ అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్ 5,000mAh బ్యాటరీతో, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌‌ సపోర్ట్‌తో, 50 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

Updated Date - 2023-11-21T16:52:07+05:30 IST