Poco: అద్భుత ఫీచర్లతో పోకో ఎఫ్5 5జీ స్మార్ట్‌ఫోన్స్ విడుదల.. ధరెంతంటే..

ABN , First Publish Date - 2023-05-09T22:37:51+05:30 IST

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ పోకో (Poco) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది.

Poco: అద్భుత ఫీచర్లతో పోకో ఎఫ్5 5జీ స్మార్ట్‌ఫోన్స్ విడుదల.. ధరెంతంటే..

హైదరాబాద్: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ పోకో (Poco) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా పోకో ఎఫ్5 5జీ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసినట్లు కంపెనీ పేర్కొంది. మంగళవారం ఇండియాతోపాటు ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో పోకో ఎఫ్5 5జీ స్మార్ట్‌ఫోన్లను (5G smartphones) ప్రవేశపెట్టినట్లు కంపెనీ వెల్లడించింది. పోకో ఎఫ్5 5జీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఫోన్లను కొనుగోలు చేయాలనుకున్న వివియోగదారులు మే 16 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. పోకో ఫోన్ 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో వేగంగా పని చేస్తోంది. భారత మార్కెట్లో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 29,999 ఉంటుంది. భారతదేశంలో పోకో ఎఫ్5 5జీ ఫోన్‌ను ఒక సంవత్సరం వారంటీతో అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

Updated Date - 2023-05-09T22:37:51+05:30 IST