Mobile phones: రూ.10 వేల లోపు ధరతో అద్భుతమైన కెమెరా అందిస్తున్న ఫోన్ల లిస్ట్ ఇదే... ఈ ఫోన్ల ఫీచర్లు ఇవే...

ABN , First Publish Date - 2023-06-18T18:04:10+05:30 IST

భారత మార్కెట్‌లో రూ. 10 వేల లోపు అద్భుతమైన కెమెరాలతో స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి.

Mobile phones: రూ.10 వేల లోపు ధరతో అద్భుతమైన కెమెరా అందిస్తున్న ఫోన్ల లిస్ట్ ఇదే... ఈ ఫోన్ల ఫీచర్లు ఇవే...

భారత మార్కెట్‌లో రూ. 10 వేల లోపు అద్భుతమైన కెమెరాలతో స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. 5జీ, ఫ్రింగర్‌ప్రింట్ సెన్సార్, హెచ్‌డీ స్క్రీన్లతో అందుబాటులోకి వచ్చిన ఫోన్లను ఎక్కువ మంది వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు.

రియల్‌మి నార్జో ఎన్53 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి.

ఈ ఏడాది మార్చి నెలలో రియల్‌మి నార్జో ఎన్53 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేశారు. 6.6 అంగుళాల పూర్తి హెచ్‌డీ డిస్‌ప్లే, 50ఎంపీ ట్రీపుల్ లెన్స్ రియర్ కెమెరా సిస్టమ్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంటుంది. ఈ ఫోన్ ధర రూ. 8999కే అందుబాటులో ఉంటుంది. ఫ్లి‌ప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 స్మార్ట్‌ఫోన్స్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి.

2022 జూన్ నెలలో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 స్మార్ట్‌ఫోన్లను విడుదల చేశారు. ఈ ఫోన్ ధర రూ.9699 ఉంటుంది. ఫ్లి‌ప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. 6.6 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ఎల్‌సీడీ డిస్‌ప్లే, 50ఎంపీ ట్రీపుల్ లెన్స్ రియర్ కెమెరా సిస్టమ్, 8ఎంపీ ఫ్రంట్ పేసింగ్ కెమెరా, 6000ఎంఏహెచ్ బ్యాటరీతోపాటు 15డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్, మీడియాటెక్ హెలియో జీ80 ప్రాసెసర్ ఉంటుంది.

షియోమి రెడ్‌మి 10 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి.

2022 మార్చి నెలలో షియోమి రెడ్‌మి 10 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేశారు. ఈ ఫోన్ ధర రూ.9499 ఉంటుంది. 6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, మీడియాటెక్ హెలియో జీ88 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, అండ్ 64జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్,క్వాడ్ కెమెరా సిస్టమ్, 50ఎంపీ+ 8ఎంపీ+2ఎంపీ కాన్ఫిగ్యూరేషన్, 13ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

నోకియా సీ32 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి.

6.52 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 50ఎంపీ రియర్ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 512జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 13, 8ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. ఈ ఫోన్ ధర రూ. 9499 ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Updated Date - 2023-06-18T18:10:25+05:30 IST