Infinix: ఆకర్షిస్తున్న కొత్త సిరీస్‌ ఇన్ఫినిక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్స్

ABN , First Publish Date - 2023-02-04T18:49:11+05:30 IST

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (New Infinix smartphones) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో రెండు స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది

Infinix: ఆకర్షిస్తున్న కొత్త సిరీస్‌ ఇన్ఫినిక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్స్

హైదరాబాద్: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (New Infinix smartphones) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో రెండు స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. శనివారం రోజు భారత (India) మార్కెట్‌లో అద్భుత ఫీచర్లతో ఇన్ఫినిక్స్ జీరో 5జీ 2023, ఇన్ఫినిక్స్ జీరో 5జీ 2023 స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసినట్లు సంస్థ తెలిపింది. కొత్త ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్స్ ఆండ్రాయిడ్ 12తో పని చేస్తోంది. ఇన్ఫినిక్స్ జీరో 5జీ టర్బో ఫోన్ రూ.19,999 ఉంటుంది. ఈ రెండు కొత్త ఫోన్లకు 16 మెగాపిక్సెన్ సెల్ఫీ కెమెరా ఉండడం దీని ప్రత్యేకత. ఫ్లిప్‌కార్ట్ ద్వారా భారత మార్కెట్‌లో ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ ఫిబ్రవరి 11 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ఇన్ఫినిక్స్ జీరో 5జీ 2023 స్మార్ట్‌ఫోన్ ధర రూ. 17,999 ఉంటుంది. 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఇన్ఫినిక్స్ జీరో 5జీ 2023 టర్మో స్మార్ట్‌ఫోన్ ధర రూ. 19,999 మాత్రమేనని సంస్థ తెలిపింది. కొత్త ఫోన్ల అమ్మకాల్లో భాగంగా పాత ఇన్ఫినిక్స్ ఫోన్లను మార్చుకోవచ్చని కంపెనీ పేర్కొంది. ఆఫర్‌లో భాగంగా ఎక్స్‌ఛేంజ్ బోనస్ రూ. 1,500 ఉంటందని సంస్థ వెల్లడించింది. రూ. 10,000 విలువ కలిగిన పాత ఫోన్లను కొత్త ఫోన్ల కోసం మార్చుకున్న వినియోగదారులకు ఎలాంటి ఈఎంఐ ఛార్జీలు ఉండవని కంపెనీ స్పష్టం చేసింది.

ఇన్ఫినిక్స్ జీరో 5జీ, ఇన్ఫినిక్స్ జీరో 5జీ టర్బో ఫోన్ల ఫీచర్స్ ఇలా ఉన్నాయి. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్, 128జీబీ ఆన్‌బోర్డు స్టోరేజ్, టర్బో ఎడిషన్ ఫీచర్స్ 256జీబీ అంతర్నిర్మిత స్టోరేజ్, వైఫై, 5జీ, బ్లూటూత్, జీపీఎస్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ టైపు-సీ పోర్టు, సెన్సార్ ఆన్‌బోర్డు, ఫింగర్‌ఫ్రింట్ సెన్సార్ అథెంటికేషన్ ఉంటుందని కంపెనీ తెలిపింది.

Updated Date - 2023-02-04T18:54:18+05:30 IST