Disney+Hotstar: యూజర్లకు షాక్ ఇచ్చిన డిస్నీ+ హాట్‌స్టార్
ABN , First Publish Date - 2023-03-08T21:57:16+05:30 IST
ప్రముఖ డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్, టెలివిజన్ నెట్‌వర్క్, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+Hotstar ) తమ వినియోగదారులకు షాక్ ఇచ్చింది.

హైదరాబాద్: ప్రముఖ డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్, టెలివిజన్ నెట్‌వర్క్, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+Hotstar ) తమ వినియోగదారులకు షాక్ ఇచ్చింది.హెచ్‌బీవో (HBO)తో కుదుర్చుకున్న ఒప్పందం ముగిసిందని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ డిస్నీ+హాట్‌స్టార్ ట్విట్టర్‌లో పేర్కొంది. మార్చి 31తో ఈ ఒప్పందం ముగిసిపోనుందని ట్విట్టర్ ద్వారా తెలిపింది. డిస్నీ+ హాట్‌స్టార్‌లో మార్చి 31 నుంచి HBO కంటెంట్ అందుబాటులో ఉండదని సంస్థ సీఈవో తెలిపారు. ఇప్పటికే 10 భాషల్లో లక్ష గంటలకు పైగా టీవీ షోలు, సినిమాలతోపాటు కొన్ని ముఖ్యమైన స్పోర్ట్స్ ఈవెంట్లను డిస్నీ+హాట్‌స్టార్‌లో చూడవచ్చని సంస్థ ట్విట్టర్‌లో పేర్కొంది. 2016 నుంచి హెచ్‌బీవో ఒరిజినల్ షోలను ప్రసారం చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
హెచ్‌బీవో సంస్థతో 2015 డిసెంబర్ నెలలో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది. 2020లో హాట్‌స్టార్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌గా మారిందని, ఆ తర్వాత కూడా ఒప్పందం కొనసాగించామని సంస్థ పేర్కొంది. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 5.5 బిలియన్ డాలర్ల మేర ఖర్చులను తగ్గించుకోవాలని సంస్థ ఇటీవల నిర్ణయించింది. ఇందులో భాగంగా 2.5 బిలియన్ డాలర్ల విలువైన ఇతర కంటెంట్‌ను తగ్గించాలని కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఇందులో 3 బిలియన్ డాలర్ల నాన్ స్పోర్ట్స్ కంటెంట్ ఉందని తెలిపింది. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఇటీవల 7 వేల మంది ఉద్యోగులను సంస్థ తొలగించింది. ఐపీఎల్ హక్కులను ఇప్పటికే డిస్నీ+ హాట్ స్టార్ వదిలేసుకుంది.