ఢిల్లీ వ్యక్తికి షాక్ ఇచ్చిన ప్రముఖ సంస్థ.. 4 ఏళ్ల తర్వాత..

ABN , First Publish Date - 2023-06-24T17:30:15+05:30 IST

ఢిల్లీకి చెందిన నితిన్ అగర్వాల్ (Nitin Agarwal) అనే టెక్కీ ఇటీవల సోషల్ మీడియాలో ఒక అసాధారణ సంఘటనను పోస్టు చేశాడు.

ఢిల్లీ వ్యక్తికి షాక్ ఇచ్చిన ప్రముఖ సంస్థ.. 4 ఏళ్ల తర్వాత..

ఢిల్లీకి చెందిన నితిన్ అగర్వాల్ (Nitin Agarwal) అనే టెక్కీ ఇటీవల సోషల్ మీడియాలో ఒక అసాధారణ సంఘటనను పోస్టు చేశాడు. తాను అలిఎక్స్‌ప్రెస్ (AliExpress) నుంచి ఆర్డర్ చేసిన వస్తువు నాలుగేళ్ల తర్వాత వచ్చిందని అతను వెల్లడించాడు. భద్రతాపరమైన సమస్యలను పేర్కొంటూ భారత ప్రభుత్వం జూన్ 2020లో 58 ఇతర చైనీస్ యాప్‌లతో పాటు AliExpressని నిషేధించింది.

ఇండియాలో AliExpressను ఇప్పుడు నిషేధించారు. అయితే కొంతకాలం క్రితం వరకు ఆన్‌లైన్ ద్వారా చౌకగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను విక్రయిస్తోంది. భారతదేశంలో అందుబాటులో లేని కొన్ని పరికరాలను AliExpress ద్వారా చైనా నుంచి తెప్పించుకోవచ్చు. ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం వెబ్‌సైట్ నుంచి ఆర్డర్ చేసిన వస్తువు 4 సంవత్సరాల తర్వాత అతనికి పార్శిల్ వచ్చింది. ఆర్డర్ చేసిన వస్తువును తాను ఎప్పటికీ పొందలేడని అతను అనుకుంటుండగా పార్శిల్ రావడం ఆశ్చర్యానికి గురి చేసిందని అతని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

2019లో అలీ బాబా యాజమాన్యంలోని ఆన్‌లైన్ రిటైల్ సర్వీస్ అయిన అలీఎక్స్‌ప్రెస్ నుంచి తాను ఆర్డర్ చేసిన వస్తువు నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు తనకు డెలివరీ అయిందని అతను వెల్లడించాడు.

అయితే ఇతరులు కూడా ఎప్పుడూ ఆశ కోల్పోవద్దని ప్రోత్సహించాడు. అలీఎక్స్‌ప్రెస్ ఇప్పుడు భారతదేశంలో నిషేధించబడిందని, అయితే నిషేధం విధించకముందే తాను కొనుగోలు చేశానని పేర్కొన్నాడు.

Updated Date - 2023-06-24T17:36:02+05:30 IST