West Indies Tour: జైస్వాల్, తిలక్‌వర్మ టీమిండియాలోకి ఎంట్రీ.. వెస్టిండీస్ టూర్‌కు జట్టు ప్రకటన

ABN , First Publish Date - 2023-07-05T22:47:27+05:30 IST

ఐపీఎల్‌లో బ్యాట్‌తో అద్భుతంగా రాణించిన యంగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్, తిలక్‌వర్మ తొలిసారి జాతీయ జట్టులో చోటు సంపాదించారు. వెస్టిండీస్‌ పర్యటనలో టీ20 సిరీస్‌కు(T20I) ఎంపిక చేసిన జట్టుకు వీరిద్దరూ ఎంపికయ్యారు

West Indies Tour: జైస్వాల్, తిలక్‌వర్మ టీమిండియాలోకి ఎంట్రీ.. వెస్టిండీస్ టూర్‌కు జట్టు ప్రకటన

ముంబై: ఐపీఎల్‌(IPL)లో బ్యాట్‌తో అద్భుతంగా రాణించిన యంగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal), తిలక్‌వర్మ(Tilak Varma) తొలిసారి జాతీయ జట్టులో చోటు సంపాదించారు. వెస్టిండీస్‌ పర్యటనలో(West Indies Tour) టీ20 సిరీస్‌కు(T20I) ఎంపిక చేసిన జట్టుకు వీరిద్దరూ ఎంపికయ్యారు. మరోవైపు వెస్టిండీస్‌తో జరిగే ఐదు టీ20 మ్యాచ్‌లకు జట్టు పగ్గాలు హార్ధిక్ పాండ్యాకు అప్పగిస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ఇక డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌కు వైస్ కెప్టెన్‌ బాధ్యతలు అప్పగించారు.

అయితే వెస్టీండీస్ టూర్ వెళ్లే భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు చోటు దక్కలేదు. అయితే వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్, టెస్ట్ సిరీస్‌లలో మాత్రం రోహిత్, విరాట్ కోహ్లీ ఆడనున్నారు. లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌‌కి కూడా తిరిగి టీ20 జట్టులో స్థానం దక్కింది. అయితే బీసీసీఐ కొత్త చీఫ్ అజిత్ అగార్కర్ బాధ్యతలు చేపట్టాక ఆయన నేతృత్వంలో ఆడుతున్న తొలి భారత జట్టు ఇదే.

భారత T20 జట్టు: ఇషాన్ కిషన్ (WK), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్‌వర్మ, సూర్యకుమార్ యాదవ్ (VC), సంజు శాంసన్ (wk), హార్దిక్ పాండ్యా(C), అక్షర్‌పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్‌యాదవ్, రవి బిష్ణోయ్, అర్షదీప్‌సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్‌ఖాన్, ముఖేష్‌కుమార్.

Updated Date - 2023-07-05T22:47:27+05:30 IST