WTC Final Australia vs India: ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్.. భారీ ఆధిక్యం

ABN , First Publish Date - 2023-06-10T18:49:17+05:30 IST

డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో నాలుగో రోజు రెండో సెషన్‌లో రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 260 పరుగుల వద్ద 7వ వికెట్ కోల్పోయింది.

WTC Final Australia vs India: ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్.. భారీ ఆధిక్యం

లండన్: డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో నాలుగో రోజు రెండో సెషన్‌లో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 260 పరుగుల వద్ద 7వ వికెట్ కోల్పోయింది. మిచెల్ స్టార్క్ 57 బంతుల్లో 41 పరుగులు చేసి షమి బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం ఆసీస్ 84 ఓవర్లలో 269 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్ 442 పరుగుల ఆధిక్యంలో ఉంది. అలెక్స్ కారీ 66, కమిన్స్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.

అంతకు ముందు తొలి సెషన్‌ ప్రారంభంలోనే ఆసీస్‌కు షాక్ తగిలింది. తొలి ఓవర్‌లో 5వ వికెట్ కోల్పోయింది. 46.4 ఓవర్ వద్ద భారత (India) బౌలర్ ఉమేశ్ వేసిన బౌలింగ్‌లో పుజారాకు క్యాచ్ ఇచ్చి లబుషేన్ ఔటయ్యాడు. దీంతో వికెట్లు పడనివ్వకుండా ఆస్ట్రేలియా (Australia) బ్యాటర్లు నిలకడగా ఆడుతున్న క్రమంలో 62.6 ఓవర్ వద్ద ఆసీస్ 167 పరుగులు చేసి 6వ వికెట్ కోల్పోయింది. కామెరాన్ గ్రీన్ 95 బంతుల్లో 25 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు.

తొలి ఇన్సింగ్స్‌లో ఆస్ట్రేలియా 469 పరుగులు చేయగా, తొలి ఇన్సింగ్స్‌లో టీం ఇండియా 296 పరుగులు చేసింది.

Updated Date - 2023-06-10T18:51:41+05:30 IST