WTC Final Australia vs India: ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్.. స్కోర్ ఎంతంటే

ABN , First Publish Date - 2023-06-10T16:52:13+05:30 IST

రెండో ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఆసీస్‌కు షాక్ తగిలింది.

WTC Final Australia vs India: ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్.. స్కోర్ ఎంతంటే

లండన్: డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో నాలుగో రోజు మొదటి సెషన్‌లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఆసీస్‌కు షాక్ తగిలింది. తొలి ఓవర్‌లో 5వ వికెట్ కోల్పోయింది. 46.4 ఓవర్ వద్ద భారత (India) బౌలర్ ఉమేశ్ వేసిన బౌలింగ్‌లో పుజారాకు క్యాచ్ ఇచ్చి లబుషేన్ ఔటయ్యాడు. దీంతో వికెట్లు పడనివ్వకుండా ఆస్ట్రేలియా (Australia) బ్యాటర్లు నిలకడగా ఆడుతున్న క్రమంలో 62.6 ఓవర్ వద్ద ఆసీస్ 167 పరుగులు చేసి 6వ వికెట్ కోల్పోయింది.

కామెరాన్ గ్రీన్ 95 బంతుల్లో 25 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం ఆసీస్ 66.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్ 364 పరుగుల ఆధిక్యంలో ఉంది. అలెక్స్ కారీ 35, చెల్ స్టార్క్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.

తొలి ఇన్సింగ్స్‌లో ఆస్ట్రేలియా 469 పరుగులు చేయగా, తొలి ఇన్సింగ్స్‌లో టీం ఇండియా 296 పరుగులు చేసింది.

Updated Date - 2023-06-10T16:52:45+05:30 IST