WTC Final Aus vs India: ముగిసిన మూడో రోజు ఆట.. ప్రస్తుత పరిస్థితి ఎంటంటే..

ABN , First Publish Date - 2023-06-09T23:02:17+05:30 IST

ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (ICC World Test Championship Final) మ్యాచ్‌లో మూడవ రోజు ఆట ముగిసింది.

WTC Final Aus vs India: ముగిసిన మూడో రోజు ఆట.. ప్రస్తుత పరిస్థితి ఎంటంటే..

లండన్: ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (ICC World Test Championship Final) మ్యాచ్‌లో మూడవ రోజు ఆట ముగిసింది. టీం ఇండియా (India) తొలి ఇన్నింగ్స్ 69.4 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా (Australia) మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగుల ఆధిక్యంతో కలిపి.. ప్రస్తుతానికి 296 పరుగుల లీడ్‌లో ఉంది.

మూడో రోజు మూడో సెషన్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా తొలి ఓవర్‌లో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. 14.1 ఓవర్ వద్ద రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్ నిలకడగా ఆడుతూ స్కోర్ పెంచుకుంటుూ వచ్చింది. 30.1 ఓవర్ వద్ద ఆసీస్ స్టీవెన్ స్మిత్ వికెట్‌ను కోల్పోయింది. 36.3 ఓవర్ వద్ద ట్రావిస్ హెడ్ ఔటయ్యాడు. హెడ్ 18, స్మిత్ 34, డేవిడ్ వార్నర్ 1, ఉస్మాన్ ఖవాజా 13 పరుగులు చేసి ఔటయ్యారు. లబుషేన్ 41, కామెరూన్ గ్రీన్ 7 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు.

Updated Date - 2023-06-09T23:03:17+05:30 IST