WTC Final Aus vs India: తొమ్మిదో వికెట్ కోల్పోయి భారత్

ABN , First Publish Date - 2023-06-09T18:28:20+05:30 IST

లంచ్ తర్వాత కమిన్స్ స్ట్రయిక్ చేయడంతో రహానే 89 పరుగుల వద్ద నిష్క్రమించాడు

WTC Final Aus vs India: తొమ్మిదో వికెట్ కోల్పోయి భారత్

లండన్: ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (ICC World Test Championship Final)లో ఆస్ట్రేలియాతో మూడో రోజు జరుగున్న మ్యాచ్‌లో భోజన విరామ సమయం అనంతరం రెండో సెషన్‌ ప్రారంభమైన వెంటనే టీం ఇండియా రెండో ఓవర్లలో 7వ వికెట్ కోల్పోయింది. 61.6 ఓవర్ వద్ద అజింక్య రహానే ఔటయ్యాడు. 129 బంతుల్లో 89 పరుగులు చేశాడు. లంచ్ తర్వాత కమిన్స్ స్ట్రయిక్ చేయడంతో రహానే 89 పరుగుల వద్ద నిష్క్రమించాడు. అజింక్య రహానే సెంచరీ పూర్తి చేస్తాడనుకున్న అభిమానుల ఆశలపై ఆస్ట్రేలియా బౌలర్ కమిన్స్‌ నీళ్లు చల్లాడు. కమిన్స్ వేసిన బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్ క్యాచ్ పట్టుకోవడంతో అజింక్య రహానే వెనుదిరిగాడు. టీం ఇండియా జట్టు స్కోర్ 270 పరుగులు దాటడంతో ఫాలోఆన్ గండం తప్పింది. అర్థ సెంచరీతో శార్దూల్ ఠాకూర్ భారత్‌ను ఆదుకున్నాడు. 68.4 ఓవర్ వద్ద భారత్ 9వ వికెట్ కోల్పోయింది.

భోజన విరామ సమయానికి 60 ఓవర్లలో టీం ఇండియా 6 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. రహానే, శార్దూల్ ఠాకూర్ సెంచరీ భాగస్వామ్యంతో భారత స్కోర్ 260 దాటేలా చేశారు. ప్రస్తుతం 108 బంతుల్లో శార్దూల్ ఠాకూర్ 51 పరుగులు చేశాడు. మహ్మద్ షమీ 5 బంతుల్లో 10 పరుగులు చేశాడు. మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ క్రీజులో ఉన్నారు.

Updated Date - 2023-06-09T18:32:06+05:30 IST