WTC Final 2023: ఫైనల్‌లో గెలుపుపై కెప్టెన్ రోహిత్ శర్మ ఏమన్నాడంటే...

ABN , First Publish Date - 2023-06-06T18:57:38+05:30 IST

ఓవల్‌ స్టేడియంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో (ICC World Test Championship Final 2023) ఆస్ట్రేలియాతో తలపడేందుకు భారత క్రికెట్ జట్టు సర్వం సిద్ధం చేసుకుంది.

WTC Final 2023: ఫైనల్‌లో గెలుపుపై కెప్టెన్ రోహిత్ శర్మ ఏమన్నాడంటే...

లండన్: ఓవల్‌ స్టేడియంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో (ICC World Test Championship Final 2023) ఆస్ట్రేలియాతో తలపడేందుకు భారత క్రికెట్ జట్టు సర్వం సిద్ధం చేసుకుంది.

టీం ఇండియా క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ (India Captain Rohit Sharma) మాట్లాడుతూ 1-2 ఛాంపియన్‌షిప్‌లు గెలవడం ఆనందంగా ఉంటుందని, అయితే టీం ప్రతి కెప్టెన్ టైటిల్ గెలవాలని కోరుకుంటాడని, అయితే తాను అందుకు భిన్నంగా లేనని చెప్పాడు.

ప్రతి ఒక్కరూ జట్టును ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటారని, అందరూ టైటిల్ గెలవాలని భావిస్తారని రోహిత్ శర్మ చెప్పాడు. ప్రతి కెప్టెన్ ఛాంపియన్‌షిప్‌లు గెలవాలని కోరుకుంటాడని, రాబోయే ఐదు రోజులు తమకు చాలా ముఖ్యమైనవి చెప్పుకొచ్చారని రోహిత్ శర్మ. తాను తమ మనస్సులో ఉన్నదానిపై దృష్టి పెట్టాలనుకుంటున్నానని కెప్టెన్ అన్నాడు.

ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు (WTC Final) ఒకరోజు ముందు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు (Rohit Sharma) స్వల్ప గాయమైంది. మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో రోహిత్ గాయపడ్డాడు. కుడి చేయి బొటనవేలికి గాయమైంది. దీని కారణంగా ప్రాక్టీస్‌ నుంచి కొంతసేపు విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది.

బుధవారం నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్‌ పోరు ప్రారంభం కానుంది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ స్టేడియంలో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

Updated Date - 2023-06-06T19:00:25+05:30 IST