Nitu Ghanghas: ప్రపంచ మహిళా బాక్సింగ్ విజేత నీతూ ఘంఘాస్

ABN , First Publish Date - 2023-03-25T20:38:24+05:30 IST

ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఏస్ ఇండియా బాక్సర్ నీతూ ఘంఘాస్(Nitu Ghanghas) బంగారు పతకం సాధించి తన పేరును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించింది.

Nitu Ghanghas: ప్రపంచ మహిళా బాక్సింగ్ విజేత నీతూ ఘంఘాస్

న్యూఢిల్లీ: ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఏస్ ఇండియా బాక్సర్ నీతూ ఘంఘాస్(Nitu Ghanghas) బంగారు పతకం సాధించి తన పేరును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించింది. ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ 48కేజీల విభాగంలో(48kg weight category) మంగోలియా(Mongolian)కు చెందిన 22 ఏళ్ల బాక్సర్ లుక్సాయికాన్ అల్టాసెట్‌సెగ్‌(Lutsaikhan Altansetseg)ను ఫైనల్‌లో 5-0 తేడాతో ఓడించి టైటిల్ విజేత(Title Winner)గా నిలిచింది. ఈ విజయంతో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్(Women's World Boxing Championships) గెలుచుకున్న 6వ భారత బాక్సర్‌గా నీతూ ఘంఘాస్ నిలిచింది.

2022 స్ట్రాండ్జా మెమోరియల్(2022 Strandja Memorial gold medallist ) బంగారు పతక విజేత అయిన నీతూ.. కామన్ వెల్త్ క్రీడల్లో మహిళా బాక్సింగ్ విభాగంలో బంగారు పతకం సాధించింది. అంతటితో ఆగకుండా మరింత దూకుడు పెంచి గెలుపే లక్ష్యంగా తన సమర్థవంతమైన పంచ్‌లతో ప్రత్యర్థిపై విరుచుకుపడి విజయాన్ని సొంతం చేసుకుంది. నీతూ ఘంఘాస్ సాధించిన బంగారు పతకంతో మొత్తం 11 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ బంగారు పతకాలను ఇండియా ఖాతాలో వేసుకుంది.

వీటిలో 6 బంగారు పతకాలు లెజెండరీ బాక్సింగ్ క్రీడాకారిణి మేరికోమ్ సాధించారు. 2002, 2005, 2006, 2008, 2018లలో మేరీకామ్(Mary Kom) ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకుంది. 2006లో భారత్‌కు చెందిన సరితాదేవి(Sarita Devi), జెన్నీ ఆర్ఎల్(Jenny RL), లేఖ(Lekha KC)లు ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.

Updated Date - 2023-03-25T20:43:55+05:30 IST