Wrestling: భారత రెజ్లర్లకు ఎదురుదెబ్బ.. WFIపై సస్పెన్షన్ వేటు

ABN , First Publish Date - 2023-08-24T16:19:13+05:30 IST

ఎన్నికలు సకాలంలో నిర్వహించడంలో విఫలమైనందుకు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI)పై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సస్పెన్షన్ వేటు విధించింది. ఈ నిర్ణయం గురువారం నుంచే తక్షణమే అమలులోకి వచ్చేలా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది.

Wrestling: భారత రెజ్లర్లకు ఎదురుదెబ్బ.. WFIపై సస్పెన్షన్ వేటు

రెజ్లింగ్ విభాగంలో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికలు సకాలంలో నిర్వహించడంలో విఫలమైనందుకు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI)పై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సస్పెన్షన్ వేటు విధించింది. ఈ నిర్ణయం గురువారం నుంచే తక్షణమే అమలులోకి వచ్చేలా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది. WFI తదుపరి గవర్నింగ్ బాడీకి ఈ ఏడాది జూన్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే పలువురు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న WFI మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై భారతీయ రెజ్లర్ల వరుస నిరసనల కారణంగా ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడలేదు.

తాజాగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సస్పెండ్ చేయడంతో రాబోయే ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లలో భారత రెజ్లర్లు పోటీ పడలేరు. దీంతో తటస్థ రెజ్లర్లుగా వాళ్లు పోటీలోకి దిగాల్సి ఉంటుంది. సెప్టెంబర్ మూడో వారం నుంచి ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌ జరగాల్సి ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 45 రోజుల్లో ఎన్నికలు నిర్వహించేలా భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తాత్కాలిక ప్యానెల్‌ను నియమించింది. అడ్ హాక్ కమిటీ గడువులోగా ఎన్నికలు నిర్వహించలేని పక్షంలో చర్యలు తీసుకుంటామని అప్పట్లోనే యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ హెచ్చరించినా పట్టించుకోలేదు. ఈ మేరకు గడువులోగా ఎన్నికలు నిర్వహించని కారణంగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI)పై సస్పెన్షన్ విధిస్తున్నట్లు బుధవారం రాత్రి అడ్ హాక్ కమిటీకి సమాచారం ఇచ్చినట్లు భారత ఒలింపిక్ అసోసియేషన్ వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్.. ధోనీ కుమార్తె రియాక్షన్ చూశారా?

భారత రెజ్లింగ్ సమాఖ్యలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఈ ఏడాది ఆరంభంలో ఢిల్లీలో జరగాల్సిన ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్- 2023 టోర్నీని కజకిస్తాన్‌లోని అస్తానాకు మార్చినట్లు UWW పేర్కొంది. మే నెలలో నిరసన తెలుపుతున్న భారతీయ రెజ్లర్లు మానవహారం నిర్వహించడం, భారత రెజ్లింగ్ సమాఖ్యకు చెందిన పలువురు అధికారులను నిర్బంధించడాన్ని UWW ఖండించింది.

Updated Date - 2023-08-24T16:20:19+05:30 IST