Virat Kohli: నా ఫోన్ వమికా ఫొటోలతో నిండింది...కోహ్లీ వెల్లడి

ABN , First Publish Date - 2023-03-30T08:34:42+05:30 IST

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ముద్దుల కుమార్తె వామిక గురించి మొట్టమొదటిసారి వెల్లడించారు....

Virat Kohli: నా ఫోన్ వమికా ఫొటోలతో నిండింది...కోహ్లీ వెల్లడి
Kohli Daughter Vamikas Photos

ముంబయి : భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ముద్దుల కుమార్తె వామిక గురించి మొట్టమొదటిసారి వెల్లడించారు.(Virat Kohli) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్‌లో పాల్గొనేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సిద్ధమవుతున్నారు. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని భార్య బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ దంపతులకు 2021 లో వామిక జన్మించింది.తన ఫోన్ కుమార్తె వామిక(Daughter Vamika) ఫొటోలతో నిండిపోయిందని విరాట్ కోహ్లీ తాజాగా వెల్లడించారు.

ఇది కూడా చదవండి : bird flu: చీలీలో మనుషుల్లో మొట్టమొదటి బర్డ్ ఫ్లూ కేసు

‘ఆర్‌సీబీ బోల్డ్ డైరీస్’తో చాట్ చేస్తున్న సమయంలో కోహ్లి తన ఫోన్(Phone) గ్యాలరీ నిండా తన కుమార్తె వామిక చిత్రాలతో నిండి ఉందని వెల్లడించారు.‘‘నా ఫోటో గ్యాలరీ నా కుమార్తె చిత్రాలతో నిండి ఉంది. నేను చాలా వామికా ఫొటోలు తీశాను, నేను వామికా, అనుష్కతో పాటు మా ఇంట్లోని కుక్క ఫొటోలు తీశాను’’ అని కోహ్లీ చెప్పారు.కోహ్లి టీ20 లీగ్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. ఐపీఎల్ 2023లో 7,000 పరుగులు చేసిన మొదటి బ్యాటర్‌గా నిలిచారు.

Updated Date - 2023-03-30T08:35:52+05:30 IST