Share News

Virat Kohli: 146 ఏళ్ల రికార్డు బ్రేక్..కోహ్లీ సాధించిన మరో ఘనత

ABN , Publish Date - Dec 29 , 2023 | 12:46 PM

భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను సాధించాడు. ఏకంగా 146 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసి తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Virat Kohli: 146 ఏళ్ల రికార్డు బ్రేక్..కోహ్లీ సాధించిన మరో ఘనత

రన్ మిషన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డును సృష్టించాడు. తన పేరు మీద మరో చారిత్రాత్మక రికార్డును లిఖించుకున్నాడు. సెంచూరియన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో విరాట్‌ కోహ్లి ఈ క్యాలెండర్ ఇయర్ (2023)లో 2000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేశాడు. దీంతో ఏడు క్యాలెండర్ సంవత్సరాలలో 2000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ అవతరించాడు.


ఏడు క్యాలెండర్ సంవత్సరాల్లో కోహ్లీ 2000 కంటే ఎక్కువ చేసిన పరుగులు

2012 లో - 2186 పరుగులు

2014 లో - 2286 పరుగులు

2016 లో - 2595 పరుగులు

2017 లో - 2818 పరుగులు

2018 లో - 2735 పరుగులు

2019 లో - 2455 పరుగులు

2023 లో - 2031*లో పరుగులు

ఈ క్రమంలో విరాట్ కోహ్లీ శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర రికార్డును చిత్తు చేశాడు. అతను ఈ ఘనతను 6 సార్లు సాధించాడు. సెంచూరియన్ టెస్టులో సౌతాఫ్రికా చేతిలో భారత్ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇంతటి ఓటమి ఎదురైనా టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సాధించడం విశేషం. కోహ్లీ ఆతిథ్య జట్టుపై రెండో ఇన్నింగ్స్‌లో 76 పరుగులు చేశాడు.


ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధికంగా 2000 పరుగులు చేసిన ఆటగాళ్లు

విరాట్ కోహ్లీ- 7*

కుమార్ సంగక్కర- 6

మహేల జయవర్ధనే - 5

సచిన్ టెండూల్కర్ - 5

జాక్వెస్ కల్లిస్ - 4

ఇక కోహ్లి తొలిసారిగా 2012లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 2000 అంతర్జాతీయ పరుగులు చేసిన ఫీట్‌ను సాధించి, ఆ ఘనత సాధించిన ఆరో భారతీయ బ్యాట్స్‌మెన్‌గా రికార్డుకెక్కారు. ఆ తర్వాత అతను 2014, 2016, 2017, 2018, 2019 తర్వాత ఇప్పుడు తాజాగా 2023లో ఈ ఘనత సాధించడం విశేషం.

అంతేకాదు దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ టెస్టులో కోహ్లీ పేరుపై మరో రికార్డు కూడా చేరింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌ ఓటమిలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇదే. కోహ్లి ఇప్పటివరకు WTCలో మొత్తం 2177 పరుగులు చేశాడు. అందులో 669 పరుగులతో విరాట్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ రికార్డు ఇంతకు ముందు ఛెతేశ్వర్ పుజారా పేరిట ఉంది.

విరాట్ కోహ్లీ- 669

చెతేశ్వర్ పుజారా- 634

రిషబ్ పంత్- 557

అజింక్య రహానె- 429

రవీంద్ర జడేజా- 276

Updated Date - Dec 29 , 2023 | 01:11 PM