IPL Tickets: అన్నీ గంటన్నరలోనే...

ABN , First Publish Date - 2023-05-13T10:32:44+05:30 IST

స్థానిక చేపాక్కం క్రికెట్‌ స్టేడియంలో శుక్రవారం ఐపీఎల్‌ టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమైన గంటన్నరలోపే ఖాళీ అయ్యాయి. ఐపీఎల్‌ పోటీల్లో

IPL Tickets: అన్నీ గంటన్నరలోనే...

పెరంబూర్‌(చెన్నై): స్థానిక చేపాక్కం క్రికెట్‌ స్టేడియంలో శుక్రవారం ఐపీఎల్‌ టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమైన గంటన్నరలోపే ఖాళీ అయ్యాయి. ఐపీఎల్‌ పోటీల్లో భాగంగా ఈ నెల 14వ తేది రాత్రి 7.30 గంటలకు చెన్నై- కోల్‌కతా(Chennai- Kolkata) మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ జరగనుండగా, ఆ మ్యాచ్‌ టిక్కెట్ల విక్రయాలు శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతాయని ప్రకటించారు. రాష్ట్రం నలుమూలలు, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన అభిమానులు గురువారం అర్ధరాత్రి నుంచే క్యూలైన్‌లలో బారులు తీరారు. స్టేడియం ప్రాంగణంలో రెండు కౌంటర్లు, మహిళలకు ప్రత్యేక కౌంటర్‌ద్వారా ఉదయం 7గం టలకువిక్రయాలు ప్రారం భంకాగా, గంటన్నరలోపే టిక్కెట్లు అమ్ముడయ్యాయి. కూలైన్లలో అభిమానులు అధికం కావడంతో, వారందరినీ రోడ్డుపై కూర్చోబెట్టిన పోలీసులు, వరుసగా పంపించారు. కౌంటర్లద్వారా ఒక టిక్కెట్లు రూ.1,500 (సీ, టీ, ఈ గ్యాలరీలు) విక్రయంతో పాటు ఆన్‌లైన్‌లో కూడా అభిమానులు టిక్కెట్లు కొనుగోలు చేశారు. ఇక, దివ్యాంగులకు ప్రత్యేకంగా తమిళనాడు క్రికెట్‌ సంఘం కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు టిక్కెట్లు విక్రయించారు.

Updated Date - 2023-05-13T10:39:13+05:30 IST