Womens T20 World Cup: ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌కు రెండో విజయం..

ABN , First Publish Date - 2023-02-15T22:10:00+05:30 IST

న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2023లో (ICC Womens T20 World Cup) భారత్ మరో విజయాన్ని అందుకుంది.

Womens T20 World Cup: ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌కు రెండో విజయం..

కేప్‌టౌన్: న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2023లో (ICC Womens T20 World Cup) భారత్ రెండో విజయాన్ని అందుకుంది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన పోరులో వెస్టిండీస్‌పై జయకేతనం ఎగురవేసింది. తొలుత బ్యాటింగ్ చేసి వెస్టిండీస్ ఉమెన్స్ నిర్దేశించిన 119 పరుగుల లక్ష్యాన్ని.. 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి భారత్ చేధించింది. బౌలింగ్‌లో 3 కీలక వికెట్లు తీసిన దీప్తి శర్మ.. లక్ష్య చేధనలో 44 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన రీచా ఘోష్ ఈ విజయంలో ముఖ్యభూమిక పోషించారు. అయితే వెస్టిండీస్ బ్యాట్స్‌ఉమెన్లను నిలువరించడంలో కీలకపాత్ర పోషించిన దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఈ విజయంతో ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో భారత్ రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

కాగా ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ ఉమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎస్ టైలర్ అత్యధికంగా 42 పరుగులు, ఎస్ క్యాంప్‌బెల్లె 30 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. 119 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత ఉమెన్స్ 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించారు. షెఫాలి వర్మ 28 పరుగులు, స్మృతి మందాన 10, రోడ్రిగేస్ 1, హర్మాన్‌ప్రీత్ కౌర్ 33, రీచా ఘోష్ 44 నాటౌట్, దేవికా వైద్య (0 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.

Updated Date - 2023-02-15T22:10:01+05:30 IST