Rohit Sharma: ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా.. 12 ఏళ్ల క్రితం రోహిత్ చేసిన ట్వీట్ వైరల్.. అసలు కథేంటంటే..
ABN , First Publish Date - 2023-11-18T19:43:24+05:30 IST
అటు ఓపెనర్‌గా అద్భుత ఆరంభాలను అందిస్తూ, ఇటు కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపిస్తూ టీమిండియాకు వరుస విజయాలు అందిస్తున్నాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. గతంలో ఏ భారత కెప్టెన్‌కు సాధ్యం కాని రీతిలో అటు బ్యాటర్‌గా, ఇటు కెప్టెన్‌గా అమోఘంగా రాణిస్తున్నాడు.
అటు ఓపెనర్‌గా అద్భుత ఆరంభాలను అందిస్తూ, ఇటు కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపిస్తూ టీమిండియాకు (Team India) వరుస విజయాలు అందిస్తున్నాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma). గతంలో ఏ భారత కెప్టెన్‌కు సాధ్యం కాని రీతిలో అటు బ్యాటర్‌గా, ఇటు కెప్టెన్‌గా అమోఘంగా రాణిస్తున్నాడు. ఆదివారం అహ్మదాబాద్‌లో జరగబోయే ఫైనల్ మ్యాచ్‌లో (WorldCup Final Match) ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడబోతోంది. రెండు అత్యుత్తమ జట్లు తలపడుతున్న ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు (India vs Australia).
ప్రస్తుత ప్రపంచకప్‌లో టీమిండియాను ఫైనల్ చేర్చిన కెప్టెన్ రోహిత్ పన్నేండేళ్ల క్రితం చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది (Rohit Old Tweet). 2011 ప్రపంచకప్ సమయంలో రోహిత్ ఆ ట్వీట్ చేశాడు. అప్పుడు ధోనీ సారథ్యంలో బరిలోకి దిగిన జట్టులో రోహిత్‌కు స్థానం దక్కలేదు. తీవ్ర మనస్తాపానికి గురైన రోహిత్ తన నిరాశను వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశాడు. ``ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కనందుకు చాలా చాలా బాధగా ఉంది. అయినా ఇక నుంచి ముందుకే వెళ్లాలి. కానీ, ఇది నాకు చాలా పెద్ద దెబ్బ.. మీ అభిప్రాయం ఏంటి`` అంటూ రోహిత్ అప్పుడు ట్వీట్ చేశాడు.
Virat Kohli: విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ.. యూపీ రెస్టారెంట్ ఓనర్‌కు కష్టాలు.. చివరకు పోలీసులకు ఫోన్ చేస్తే..
న్యూజిలాండ్‌తో సెమీస్‌లో మ్యాచ్ గెలిచిన అనంతరం మళ్లీ ఈ ట్వీట్ వైరల్ (Rohit Viral Tweet) అవుతోంది. ఈ వైరల్ ట్వీట్‌పై క్రికెట్ అభిమానులు భారీగా స్పందిస్తున్నారు. ``అవును.. రోహిత్ చాలా దూరం ప్రయాణించాడు``, ``రోహిత్.. నువ్వు గొప్ప ఆటగాడివి, నాయకుడివి``, ``ఆ తర్వాత 2015, 2019, 2023 ప్రపంచకప్‌లలో నీ ప్రదర్శన అద్వితీయం``, ``నువ్వు స్వార్థం లేని ఆటగాడివి`` అంటూ అభిమానులు కామెంట్లు చేశారు.
