WPL 2023: వారియర్స్‌పై టాస్ గెలిచిన ఢిల్లీ కేపిటల్స్

ABN , First Publish Date - 2023-03-21T19:25:46+05:30 IST

మహిళల ప్రీమియర్ లీగ్ చివరి అంకానికి చేరుకుంది. పాయింట్ల పట్టికలో రెండు మూడు స్థానాల్లో ఉన్న ఢిల్లీ కేపిటల్స్(Delhi Capitals)

WPL 2023: వారియర్స్‌పై టాస్ గెలిచిన ఢిల్లీ కేపిటల్స్

ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ చివరి అంకానికి చేరుకుంది. పాయింట్ల పట్టికలో రెండు మూడు స్థానాల్లో ఉన్న ఢిల్లీ కేపిటల్స్(Delhi Capitals)-యూపీ వారియర్స్(UP Warriorz) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కేపిటల్స్ ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్‌లో కనుక ఢిల్లీ విజయం సాధిస్తే మెరుగైన రన్‌రేట్ కారణంగా ఫైనల్స్‌కు చేరుకుంటుంది. అప్పుడు ముంబై ఇండియన్స్(Mumbai Indians) రెండో స్థానానికి పరిమితం అవుతుంది. మూడో స్థానంలో ఉన్న యూపీ వారియర్స్ మ్యాచ్‌లో ఓడినా, గెలిచినా ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ జట్టు నెట్ రన్‌రేట్ మైనస్‌లలో ఉండడమే అందుకు కారణం.

మరోవైపు, వారియర్స్‌ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే ఆ జట్టు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. దీంతో ఢిల్లీ కేపిటల్స్ అప్రమత్తంగా ఉంది. మరి ఈ మ్యాచ్‌లో యూపీ ఓడి ఢిల్లీని ఫైనల్స్‌కు పంపిస్తుందా? లేదంటే గెలిచి ముంబై ఆ చాన్స్ ఇస్తుందా? వేచి చూడాల్సిందే.

Updated Date - 2023-03-21T19:25:46+05:30 IST