Sanju Samson: ట్రైనింగ్‌లో ఫుల్ ఫైర్!

ABN , First Publish Date - 2023-03-20T16:47:48+05:30 IST

సంజు శాంసన్(Sanju Samson).. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీమిండియా క్రికెటర్లలో అతడొకడు.

Sanju Samson: ట్రైనింగ్‌లో ఫుల్ ఫైర్!

న్యూఢిల్లీ: సంజు శాంసన్(Sanju Samson).. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీమిండియా క్రికెటర్లలో అతడొకడు. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన సంజూకు ఇప్పటి వరకు తగిన బ్రేక్ రాలేదు. మంచి బ్యాటింగ్ నైపుణ్యం ఉన్న సంజూకి అభిమానులు కుప్పలు తెప్పలుగా ఉన్నారు. జట్టు నుంచి అతడిని పక్కనపెట్టిన ప్రతిసారి శాంసన్‌కు వారు అండగా నిలిచారు. తాజాగా, సంజు శాంసన్‌కు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. శాంసన్ అభిమానులే దీనిని షేర్ చేశారు.

మరికొన్ని రోజుల్లో ఐపీఎల్(IPL) ప్రారంభం కానున్న నేపథ్యంలో మైదానంలో సంజూ చెమటోడుస్తున్న వీడియో ఇది. ఈ వీడియోలో సంజూ బంతులను ఎడాపెడా బాదడం కనిపించింది. ఈ ఏడాది జనవరిలో శ్రీలంక(Sri Lanka)తో జరిగిన టీ20 సిరీస్‌లో సంజూ ఆడాడు. గాయం కారణంగా సిరీస్‌కు, జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(NCA)లో పునరావాసం పొందాడు.

తాజా వీడియోలో శాంసన్ భారీ షాట్లు బాదడం కనిపించింది. శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు ఏప్రిల్ 2న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తొలి మ్యాచ్‌లో తలపడుతుంది. గతేడాది డిసెంబరులో జరిగిన ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ ఫ్రాంచైజీ పలువురు ఆటగాళ్లను కొనుగోలు చేసి జట్టును మరింత బలోపేతం చేసుకుంది. వీరిలో జో రూట్, మురుగన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ఆడం జంపా తదితరులు ఉన్నారు.

వేలంలో కొనుగోలు చేసింది వీరినే..

జాసన్ హోల్డర్ (రూ. 5.75 కోట్లు), ఆడం జంపా (రూ. 1.5 కోట్లు), జో రూట్ (రూ.కోటి), డొనోవన్ ఫెరీరా (రూ. 50 లక్షలు), కేఎం ఆసిఫ్ (రూ. 30 లక్షలు), అబ్దుల్ పీఏ (రూ. 20 లక్షలు), ఆకాశ్ వశిష్ట్ (రూ. 20 లక్షలు), మురుగన్ అశ్విన్ (రూ. 20 లక్షలు), కునాల్ రాథోడ్ (రూ. 20 లక్షలు)

రిటైన్‌డ్ ఆటగాళ్లు

సంజు శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, షిమ్రన్ హెట్మెయిర్, దేవదత్ పడిక్కల్, జోస్ బట్లర్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగా, ప్రసీధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్, ఒబెడ్ మెక్‌కోయ్, నవ్‌దీప్ సైనీ, కుల్దీప్ సేన్, కుల్దీప్ యాదవ్, ఆర్.అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, కేసీ కరియప్ప.

Updated Date - 2023-03-20T16:52:00+05:30 IST