IPL 2023: ధావన్ వచ్చేశాడు.. పంజాబ్‌దే టాస్

ABN , First Publish Date - 2023-04-28T19:19:28+05:30 IST

లక్నో సూపర్ జెయింట్స్‌(LSG)పై టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్(PBKS) ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు

IPL 2023: ధావన్ వచ్చేశాడు.. పంజాబ్‌దే టాస్

మొహాలీ: లక్నో సూపర్ జెయింట్స్‌(LSG)పై టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్(PBKS) ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఐపీఎల్‌లో ఇది 38వ మ్యాచ్ కాగా, మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. గాయం కారణంగా మూడు మ్యాచ్‌లకు దూరమైన పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) మళ్లీ వచ్చేయడంతో పంజాబ్ జట్టు రెట్టించిన ఉత్సాహంతో ఉంది.

ఇప్పటి వరకు రెండు జట్లు చెరో ఏడు మ్యాచ్‌లు ఆడగా నాలుగింటిలో విజయం సాధించాయి. ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే ఇకపై అన్ని మ్యాచ్‌లు కీలకమే. ఈ నేపథ్యంలో ఇరు జట్లు గెలుపుపైనే దృష్టిసారించాయి. ఈ సీజన్‌లో ఈ స్టేడియంలో ఇప్పటి వరకు 200 పరుగులు నమోదు కాలేదు. బ్యాటర్లకు అనుకూలించే ఈ పిచ్‌పై నేడైనా స్కోరు 200 పరుగులు దాటుతుందేమో చూడాలి.

Updated Date - 2023-04-28T19:19:28+05:30 IST