MIW vs UPW: నత్తనడకన సాగుతున్న ముంబై బ్యాటింగ్.. సగం ఓవర్లు ముగిసే సరికి..

ABN , First Publish Date - 2023-03-18T16:20:36+05:30 IST

మహిళ ప్రీమియర్ లీగ్‌(WPL)లో భాగంగా యూపీ వారియర్స్‌(UP Warriorz)తో జరుగుతున్న

MIW vs UPW: నత్తనడకన సాగుతున్న ముంబై బ్యాటింగ్.. సగం ఓవర్లు ముగిసే సరికి..

నవీ ముంబై: మహిళ ప్రీమియర్ లీగ్‌(WPL)లో భాగంగా యూపీ వారియర్స్‌(UP Warriorz)తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) నిదానంగా ఆడుతోంది. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచుల్లోనూ విజయం సాధించిన ముంబై 10 పాయింట్లతో ఇప్పటికే తర్వాతి దశకు అర్హత సాధించింది. యూపీ అమ్మాయిలు మాత్రం ఐదు మ్యాచ్‌లు ఆడి రెండింటిలోనే విజయం సాధించి మూడో స్థానంలో ఉంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూపీ.. ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలి వికెట్‌కు హేలీ మాథ్యూస్-యస్తికా భాటియా కలిసి 30 పరుగులు జోడించారు. హేలీ దాటిగా ఆడగా భాటియా సహజ సిద్ధమైన ఆటతీరుకు భిన్నంగా నిదానంగా ఆడింది. 15 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేసిన యస్తిక.. అంజలి శ్రావణి బౌలింగులో బౌల్డ్ అయింది. ఆ తర్వాత 9 పరుగులకే నట్ స్కివెర్ బ్రంట్ (5) కూడా పెవిలియన్ చేరింది. ప్రస్తుతం సగం ఓవర్లు ముగిశాయి. ముంబై 2 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. హేలీ 35, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Updated Date - 2023-03-18T16:20:36+05:30 IST