IPL 2023: అట్టహాసంగా ఐపీఎల్ ఆరంభం.. స్టేడియాన్ని హోరెత్తించిన తెలుగుపాటలు.. ఏమేం పాటలంటే..

ABN , First Publish Date - 2023-03-31T19:00:56+05:30 IST

ఐపీఎల్-2023 వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గాయకుడు అరిజిత్ సింగ్ తన గానంతో తొలుత ప్రేక్షకులను మైమరపించగా, ప్రముఖ

IPL 2023: అట్టహాసంగా ఐపీఎల్ ఆరంభం.. స్టేడియాన్ని హోరెత్తించిన  తెలుగుపాటలు.. ఏమేం పాటలంటే..

అహ్మదాబాద్: ఐపీఎల్-2023(IPL 2023) వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గాయకుడు అరిజిత్ సింగ్(Arijit Singh) తన గానంతో తొలుత ప్రేక్షకులను మైమరపించగా, ప్రముఖ హీరోయిన్లు తమన్నా భాటియా(Tamanna Bhatia), రష్మిక మందన్న(Rashmika Mandanna) తెలుగు పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. తమన్నా తొలుత పుష్ప(Pushpa) సినిమాలోని ‘ఊ.. అంటావా..’పాటకు స్టెప్పులేయగా, ఆ తర్వాత వచ్చిన రష్మిక.. ‘రారా సామీ.. ’ అని పాట, ‘శ్రీ వల్లి..’ గంగూబాయి సినిమాలోని ‘డోలీనా..’, ఆర్ఆర్ఆర్ సినిమాలో ‘నాటు నాటు..’పాటకు డ్యాన్స్ చేసి ఆడియన్స్‌ను మత్తులో ముంచెత్తింది. ‘నాటునాటు..’ పాటతో ప్రదర్శన ముగిసింది.

rashmika.jpg

అరిజిత్ సింగ్ పాటలకు, తమన్నా, రష్మిక డ్యాన్సులకు స్టేడియంలోని వేలాదిమంది ప్రేక్షకులు తమనుతాము మైమరిపోయారు. ప్రదర్శన అనంతరం గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ మొదలుకాబోతున్నట్టు ప్రెజెంటర్ మందిరా బేడీ ప్రకటించారు. ఇరు జట్ల కెప్టెన్లు మహేంద్రసింగ్ ధోనీ, హార్దిక్ పాండ్యాలను వేదికపైకి పిలిచారు. వారిద్దరూ వేదికపైనున్న బీసీసీఐ కార్యదర్శి జే షా, రోజర్ బిన్నీ, రష్మిక, తమన్నా, అరిజిత్ సింగ్‌లను పరిచయం చేసుకున్నారు.

ipl5.jpg

Updated Date - 2023-03-31T19:23:20+05:30 IST