IPL 2023: పంజాబ్-కోల్‌కతా మ్యాచ్‌ను ఆపేసిన వర్షం

ABN , First Publish Date - 2023-04-01T19:50:11+05:30 IST

ఐపీఎల్(IPL 2023) ప్రేక్షకులకు రెండో రోజే నిరాశ ఎదురైంది

IPL 2023: పంజాబ్-కోల్‌కతా మ్యాచ్‌ను ఆపేసిన వర్షం

మొహాలీ: ఐపీఎల్(IPL 2023) ప్రేక్షకులకు రెండో రోజే నిరాశ ఎదురైంది. మొహాలీలో పంజాబ్ కింగ్స్(Punjab Kings)-కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) మధ్య జరుగుతున్న మ్యాచ్ వర్షం కారణంగా ఆగింది. లక్ష్య ఛేదనలో ఉన్న కోల్‌కతా 24 బంతుల్లో 46 పరుగులు చేయాల్సిన సమయంలో వరుణుడు అడుగుపెట్టడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. భానుక రాజపక్స అర్ధ సెంచరీ (50)తో టాప్ స్కోరర్‌గా నిలవగా, కెప్టెన్ శిఖర్ ధావన్ 40 పరుగులు చేశాడు.

అనంతరం 192 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కేకేఆర్ ఒకానొక దశలో 29 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, వెంకటేశ్ అయ్యర్ (34), కెప్టెన్ నితీశ్ రాణా (24), ఆండ్రూ రసెల్ (35) కాసేపు క్రీజులో కుదురుకుని బ్యాట్లు ఝళిపించి కేకేఆర్ అభిమానుల్లో ఆశలు నింపారు. విజయానికి 24 బంతుల్లో 46 పరుగులు చేయాల్సిన తరుణంలో వర్షం పడడంతో మ్యాచ్‌ను నిలపివేశారు. క్రీజులో శార్దూల్ ఠాకూర్ (8), సునీల్ నరైన్ (7) ఉండడంతో విజయంపై కేకేఆర్ ధీమాగా ఉంది.

Updated Date - 2023-04-01T19:50:11+05:30 IST