IPL 2023: గెలుపోటముల ఎలా ఉన్నా ఆ విషయంలో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్‌ను మించిన టీమే లేదు!.. రెండో స్థానంలో ఆర్సీబీ..

ABN , First Publish Date - 2023-04-13T19:26:09+05:30 IST

ఇండియన్ ప్రీమియర్(IPL 2023) లీగ్‌‌లో భాగంగా డిఫెండింగ్ చాంపియన్స్ గుజరాత్

IPL 2023: గెలుపోటముల ఎలా ఉన్నా ఆ విషయంలో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్‌ను మించిన టీమే లేదు!.. రెండో స్థానంలో ఆర్సీబీ..

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్(IPL 2023) లీగ్‌‌లో భాగంగా డిఫెండింగ్ చాంపియన్స్ గుజరాత్ టైటాన్స్(GT)తో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) ఓటమి పాలైంది. మైదానంలో ఆ జట్టు ఓటమి పాలైనా సోషల్ మీడియాలో మాత్రం ఆ జట్టుకు ఎదురే లేకుండాపోయింది. తొలి వారంలో ఆ జట్టు అభిమానులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను దున్నేశారు. ఫేస్‌బుక్(Facebook), ట్విట్టర్(Twitter), ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లలో అత్యధికమంది చర్చించుకున్న ఐపీఎల్ ఫ్రాంచైజీగా చెన్నై సూపర్ కింగ్స్ రికార్డులకెక్కింది.

నాలుగుసార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన చెన్నై జట్టు గత సీజన్‌లో మాత్రం చతికిలపడింది. కింది నుంచి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. అయినప్పటికీ ఆ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ(MS Dhoni)కి ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే సీఎస్‌కే మ్యాచ్‌ల టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోవడానికి కారణం ఇదే. అంతేకాదు, సోషల్ మీడియాలోనూ ఆ జట్టుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

పాపులర్ వెబ్‌సైట్ ‘కామ్‌స్కోర్’(Comscore) ప్రకారం మిగతా ఫ్రాంచైజీలతో పోలిస్తే ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక రియాక్షన్లు, లైకులు, షేర్లు, కామెంట్లు, రీ ట్వీట్లు సొంతం చేసుకున్న జట్టుగా ధోనీ సేన రికార్డులకెక్కింది. అలాగే, మిగతా ఐపీఎల్ ఫ్రాంచైజీలతో పోలిస్తే యాక్షన్స్ పరంగా అంటే ‘యాక్షన్స్ పర్ పోస్ట్’ విషయంలోనూ చెన్నై దుమ్ము రేపుతోంది.

ఇక, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత సోషల్ మీడియాలో అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన ఫ్రాంచైజీగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) రికార్డులకెక్కింది. ఇక, ఐదుసార్లు ఐపీఎల్ విజేత అయిన ముంబై ఇండియన్స్‌(MI) సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్ పరంగా చెన్నై కంటే చాలా వెనకబడి ఉంది. ఈ సీజన్‌లోనూ ముంబై ప్రదర్శన అంతంత మాత్రమే కావడంతో దాని ఫ్యాన్ బేస్ మరింత పడిపోయే అవకాశం ఉంది.

‘కామ్‌స్కోర్’ జాబితాలో కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR) నాలుగో స్థానంలో ఉంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ అటు మైదానంలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ ప్రభావం చూపుతోంది. ఆ జట్టు ఐదో స్థానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్ ఆరో స్థానంలో ఉండగా, ఢిల్లీ కేపిటల్స్ ఏడో స్థానంలో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

Updated Date - 2023-04-13T19:26:09+05:30 IST