IPL 2023: బౌలర్ల దెబ్బకు వణికిన ఢిల్లీ.. గుజరాత్ ముందు ఓ మోస్తరు లక్ష్యం

ABN , First Publish Date - 2023-04-04T21:31:51+05:30 IST

గుజరాత్ టైటాన్స్‌(Gujarat Titans)తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్(Delhi Capitals) నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి

IPL 2023: బౌలర్ల దెబ్బకు వణికిన ఢిల్లీ.. గుజరాత్ ముందు ఓ మోస్తరు లక్ష్యం

ఢిల్లీ: గుజరాత్ టైటాన్స్‌(Gujarat Titans)తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్(Delhi Capitals) నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. వరుస పెట్టి వికెట్లు కోల్పోయిన ఢిల్లీ (DC) ఏ దశలోనూ కోలుకోలేకపోయింది.

కెప్టెన్ డేవిడ్ వార్నర్ చేసిన 37 పరుగులే అత్యధికం. సర్ఫరాజ్ ఖాన్ 30, అభిషేక్ పోరెల్ 20, అక్షర్ పటేల్ 36 పరుగులు చేశారు. మిగతా వారిలో ఒక్కరు కూడా సింగిల్ డిజిట్ దాటలేకపోయారు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ, రషీద్ ఖాన్ చెరో మూడు వికెట్లు తీసుకోగా, అల్జారీ జోసెఫ్ 2 వికెట్లు తీసుకున్నాడు.

Updated Date - 2023-04-04T21:31:51+05:30 IST