IPL 2023: బ్యాటింగులో ఢిల్లీ బోల్తా.. అమన్ ఖాన్ ఆడకుంటే..

ABN , First Publish Date - 2023-05-02T21:31:55+05:30 IST

ఢిల్లీ కేపిటల్స్‌ (Delhi Capitals)ని ఇప్పట్లో కష్టాలు వీడేలా కనిపించడం లేదు. బ్యాటర్లందరూ

IPL 2023: బ్యాటింగులో ఢిల్లీ బోల్తా.. అమన్ ఖాన్ ఆడకుంటే..

అహ్మదాబాద్: ఢిల్లీ కేపిటల్స్‌ (Delhi Capitals)ని ఇప్పట్లో కష్టాలు వీడేలా కనిపించడం లేదు. బ్యాటర్లందరూ దారుణంగా విఫలం కావడంతో గుజరాత్ టైటాన్స్‌ (Gujarat Titans)తో జరుగుతున్న మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు ఓ మోస్తరు స్కోరు చేసింది.

షమీ దెబ్బకు ఢిల్లీ బ్యాటర్లందరూ వెనుదిరుగుతుంటే అమన్ హకీం ఖాన్ మాత్రం క్రీజులో పాతుకుపోయి ఒంటరి పోరాటం చేశాడు. 44 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధ సెంచరీ (51) సాధించాడు. లేదంటే ఢిల్లీ 100 పరుగుల లోపు చాప చుట్టేసేదే. అక్షర్ పటేల్ (27), రిపల్ పటేల్ (23) కాస్తంత నిలదొక్కుకుని పరవాలేదనిపించారు.

ఫిలిప్ సాల్ట్ గోల్డెన్ డక్ కాగా, కెప్టెన్ వార్నర్ 2, ప్రియం గార్గ్ 10, రిలీ రోసౌ 8, మనీష్ పాండే 1, అన్రిక్ నోకియా 3(నాటౌట్) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ 4 వికెట్లు తీసుకోగా, మోహిత్ శర్మ 2 వికెట్లు పడగొట్టాడు.

Updated Date - 2023-05-02T21:33:04+05:30 IST