Sunrisers Hyderabad: సన్‌రైజర్స్‌కు కొత్త కెప్టెన్ వచ్చేశాడు!

ABN , First Publish Date - 2023-02-23T17:20:42+05:30 IST

ఐపీఎల్ 2023కి సమయం దగ్గరపడుతోంది. ఫ్రాంచైజీలు జట్ల కూర్పును ప్రారంభించాయి.

Sunrisers Hyderabad: సన్‌రైజర్స్‌కు కొత్త కెప్టెన్ వచ్చేశాడు!

హైదరాబాద్: ఐపీఎల్ 2023కి సమయం దగ్గరపడుతోంది. ఫ్రాంచైజీలు జట్ల కూర్పును ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు కొత్త కెప్టెన్‌ను నియమించుకుంది. దక్షిణాఫ్రికా బ్యాటర్ ఐడెన్ మార్కరమ్‌(Aiden Markram)కు జట్టు పగ్గాలు అప్పగించింది. దక్షిణాఫ్రికా టీ20 లీగ్ ‘ఎస్ఏ-20’లో ఎస్ఆర్‌హెచ్ సిస్టర్ ఫ్రాంచైజీ ‘సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్’(Sunrisers Eastern Cape)కు మార్కరమ్ సారథ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో మార్కరమ్ జట్టుకు టైటిల్‌ను అందించాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్‌కు కూడా అతడినే కెప్టెన్‌గా నియమించింది.

గత సీజన్‌లో జట్టుకు సారథ్యం వహించిన కేన్ విలియమ్సన్‌(Kane Williamson)ను ఇటీవల జరిగిన వేలంలో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో కొత్త కెప్టెన్ కోసం వెతికిన హైదరాబాద్ 29 ఏళ్ల మార్కరమ్‌కే పగ్గాలు అప్పగించింది. విలియమ్సన్ మొత్తం మూడు సీజన్లలో జట్టును నడిపించాడు. మయాంక్ అగర్వాల్(Mayank Agarwal) సహా కెప్టెన్సీ కోసం పలువురు పోటీ పడినా చివరికి అది మార్కరమ్‌నే వరించింది.

‘ఎస్ 20’ ఫైనల్‌కు ముందు మార్కరమ్ మాట్లాడుతూ.. ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్సీపై ఆసక్తి కనబరిచాడు. ఏం జరుగుతుందో తెలియదని, కాకపోతే మేనేజ్‌మెంట్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నాడు. కెప్టెన్సీ అనేది చాలా గొప్పదని, తాను ఇప్పటికే కెప్టెన్సీ రోల్‌లో ఉన్నాను కాబట్టి దానిని నిర్వహించడం బాగుంటుందని చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ గత సీజన్‌లో హైదరాబాద్ తరపున 14 మ్యాచ్‌లు ఆడిన మార్కరమ్ 381 పరుగులు చేశాడు. ఇక, ఎస్ 20లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్‌కు సారథ్యం వహించిన మార్కరమ్ సెమీఫైనల్‌లో సెంచరీ బాది జట్టును ఫైనల్‌కు చేర్చాడు. తుది పోరులో ప్రిటోరియా కేపిటల్స్‌(Pretoria Capitals)ను ఓడించి ఎస్ఏ20 టైటిల్‌ను జట్టుకు అందించాడు.

Updated Date - 2023-02-23T17:20:44+05:30 IST